Botsa satyanarayana

Botsa Satyanarayana,PCC Chief Botsa Satyanarayana, Congress Party,

Botsa Satyanarayana

Botsa.gif

Posted: 07/05/2012 12:02 PM IST
Botsa satyanarayana

Botsa Satyanarayana

పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇటీవలికాలంలో కాస్త వైరాగ్యం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. పిసిసి అద్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కాంగ్రెస్ కోసం, గాంధీ భవన్ కార్యకలాపాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టి పేరు తెచ్చుకోవాలని ఆయన భావించారు. అయితే ఆ తర్వాత జరిగిన వివిధ పరిణామాలు ఆయనలో పూర్తి నైరాశ్యాన్ని నింపాయని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది. పైగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో వివాదంలో చిక్కుకోవడం, మద్యం సిండికేట్ల కేసుల బారిన పడకుండా నానా తంటాలు పడడం ..చివరికి అదిష్టానం వద్ద ఏదో తప్పు చేసినట్లు అనిపించుకోవలసి రావడం వంటివాటితోపాటు ఆర్ధికంగా ఎదురవుతున్న సమస్యలు కూడా ఆయన నైరాశ్యానికి కారణంగా చెబుతున్నారు.కొన్నిసార్లు ఏదైనా తొందరపడినట్లు అనిపించినా, పార్టీకోసం ఖర్చు చేయడానికి వెనుకాడని వ్యక్తిగా ఆయనకు పేరుంది. అయితే ఇటీవలికాలంలో ఆయనకు వనరుల కొరత ఎదురవుతోందని అంటున్నారు.తను,తన కుటుంబం స్వయంగా మద్యం వ్యాపారం నుంచి వైదొలగడంతో పాటు ఇతరత్రా వ్యాపారాల జోలికి వెళ్లడానికి వెనుకాముందు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇంతా చేసి ఎలాగొలా నిధులు సమీకరించి, ఏదైనా చేద్దామన్నా, ఎందుకోసం, ఎవరికోసం చేయాలన్న భావన ఆయన లో కనిపిస్తోందని ఆయన సన్నిహితులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే ఇటీవలి ఉప ఎన్నికలలో కొందరు అభ్యర్దులకు బొత్స కూడా నిధుల హామీ ఇచ్చి కూడా పూర్తిగా నెరవేర్చుకోలేకపోయారని ఒక నాయకుడు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  7 lakh chicken die as agitators cut power
Kishore chandra dev from ap in new central cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles