C ramachandraiah sensational comments on ttd officers

C Ramachandraiah sensational comments on ttd officers, Tirupathi, Tirumala devastanam, Minister, fire, TTD Officer,

C Ramachandraiah sensational comments on ttd officers

Ramachandraiah.gif

Posted: 07/03/2012 10:42 AM IST
C ramachandraiah sensational comments on ttd officers

C Ramachandraiah sensational comments on ttd officers

 తిరుమల తిరుపతి దేవస్థానానికి తన కార్యాలయం నుంచి పంపిస్తున్న సిఫార్సుల లేఖలను అక్కడి అధికారులు పక్కన పడేస్తున్నారంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి చెన్నంశెట్టి రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న సన్నిధికి వెళ్ళే భక్తులకు వసతి, దర్శనం, ఇతరత్రా సేవల కోసం తన కార్యాలయం నుంచి జారీ చేస్తున్న సిఫార్సు లేఖలను ఖాతరు చేయడం లేదని తెలుసుకున్న మంత్రి రామచంద్రయ్య తన అనుయాయుల వద్ద బాధను వ్యక్తం చేశారు. టిటిడి  అధికారులు, సిబ్బంది వైఖరి పట్ల మనస్థాపానికి గురయ్యానని ఆయన ఆవేదనగా అన్నారు. వారి తీరుకు నిరసనగా ఇక నుంచి తన కార్యాలయం నుంచి సిఫార్సు లేఖలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి, తిరుమల కొండపైన కొంత మంది దళారులు 6 కేంద్రాల్లో స్వామి సేవలకు చెందిన టికెట్లును బ్లాక్‌లో అమ్ముతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. టిటిడి పాలక మండలి అధ్యక్షుడు, పాలక మండలి సభ్యుల నుంచి అనేక సంఖ్యలో సిఫార్సు లేఖలు పంపిస్తుంటారని, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన లేఖలను టిటిడి అధికారులు ఎందుకు ఖాతరు చేయడం లేదోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారని, తన పరువుపోతోందని ఆయన అన్నారని తెలిసింది. ఇటీవల తన బంధువులు అమెరికా నుంచి వచ్చారని వారు తిరుమల వెళుతుంటే తన లేఖను పంపించానని అయితే టిటిడి అధికారులు వాటిని బుట్టదాఖలు చేశారని ఆయన అన్నట్లు సమాచారం. మంత్రి లేఖలకే దిక్కులేకపోతే ఇక సామాన్యులకు దిక్కెవరని ఆయన ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu and ys jagan
Explain phone calls to hacks hc tells cbi joint director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles