Lakshmidevi

lakshmidevi, medak district, navabhupeta,

lakshmidevi

lakshmidevi.gif

Posted: 06/29/2012 12:00 PM IST
Lakshmidevi

lakshmidevi

మెదక్‌లోని నవాబుపేట సమీపంలో ఈద్గా నిర్మాణ పనుల్లో లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన పురాతన రాతి తోరణం, ఇతర శిల్పాలు బయల్పడ్డాయి. జెసిబితో తవ్వకాలు జరుపుతుండగా లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన పురాతన రాతి తోరణం బయటపడింది. సమీపంలో మరో చెక్కిన రాతి ప్రతిమ దర్శనమిచ్చింది. ఇది కాకతీయుల కాలం నాటి శిల్పంగా భావిస్తున్నారు. ఈద్గాను ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలం గట్టుపై గల బండరాయిపై పాదాలు చెక్కి ఉన్నాయి. ఇవన్నీ వందల సంవత్సరాల క్రితం నాటివని స్పష్టమవుతోంది. విషయం తెలుసుకున్న ఆర్‌డిఓ, తహశీల్దార్, డిఎస్‌పి తదితర అధికారులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయతే, వీటి తరలింపుపై రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకుని వీరిని శాంతింపచేశారు. రెండు వర్గాలకు చెందిన ముఖ్యులతో చర్చించారు. రాతి తోరణాన్ని ఇక్కడి నుండి మరోచోటికి తరలించరాదని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఆర్‌డిఓను ఘెరావ్ చేశారు. దీంతో చేసేదేమిలేక ఆర్‌డిఓ కార్యాలయం నుండి రాతి తోరణాన్ని తెప్పించి భారీ పోలీసు బందోబస్తు మధ్య గట్టమ్మ దేవాలయం వద్ద ఉంచారు. పురావస్తు శాఖ అధికారులు వచ్చి తవ్వకాలు జరిపి పూర్తి స్థాయిలో నిర్ధారించే వరకు ఈద్గా పనులు చేపట్టరాదని నిర్వాహకులను ఆర్‌డిఓ వనజాదేవి ఆదేశించారు. పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  20 naxalites killed in encounter
Tdp will choose between pranab sangma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles