Botsa vasudeva naidu arrested in lakshmi pet case

Botsa Vasudeva Naidu arrested in Lakshmi Pet case,Laskshmipet massacre,Botsa Vasudeva Naidu,Aavu Srinivasa Rao

Botsa Vasudeva Naidu arrested in Lakshmi Pet case|

Botsa00.gif

Posted: 06/29/2012 11:37 AM IST
Botsa vasudeva naidu arrested in lakshmi pet case

బొత్స అంటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాదు?  శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితులపై పాశవికంగా దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు బొత్స వాసుదేవ నాయుడును సిఐడి అధికారుల బృందం హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో నాయుడు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న సిఐడి అధికారులు అతన్ని అరెస్టు చేసినట్లు డిజిపి కార్యాలయ అధికార ప్రతినిధి, శాంతిభద్రతల విభాగం డిజి ఎస్‌ఏ హుడా తెలిపారు. కాగా, ఈ కేసులో నాయుడు కీలక నిందితుడు కావడంతో సిఐడి విచారణ కీలక మలుపు తిరిగింది.

లక్ష్మీపేట ఘటనలో వాసుదేవ నాయుడు తెర వెనుక ఉండి దళితులపై దాడి చేయించారని అక్కడ ఉన్న దళిత, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. రాష్ట్ర వ్యాప్తంగానే ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దళితులపై దాడి జరిగినప్పుడు కొందరు చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు. ఈ దారుణ సంఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో దాడిని నివారించలేకపోయిన స్థానిక డిఎస్పీ, ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలను విధుల నుంచి తొలగించి విఆర్‌కి పంపించింది. అనంతరం ఈ కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. కేసు దర్యాప్తును చేపట్టిన సిఐడి బృందాలు విచారణకు రంగంలో దిగాయి. విచారణకు సిఐడి అదనపు ఎస్‌పి రమణారావును పోలీసు శాఖ నియమించింది. సిఐడి విచారణ అనంతరం 65 మందిని ప్రాథమికంగా నిందితులుగా గుర్తించి కొందరిని అదుపులోకి తీసుకుంది. సిఐడి ఇన్‌చార్జ్ అదనపు డిజిపి గోపాల్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాల్లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు బొత్స వాసుదేవ నాయుడు అరెస్టు కావడంతో విచారణ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp will choose between pranab sangma
Priyanka chopra is learning telugu from ram charan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles