సాములోరికి ఆసీనుడవడానికి పులిచర్మం-రెండు ఏనుగు దంతాలు చాలవా? నిత్యానందులవారి దగ్గర- తాను కూర్చున్నదే కాక పది వ్యాఘ్ర చర్మాలు, పది ఏనుగు దంతాలు ఉన్నాయి. నిత్యానందంగా అన్నీ కేసులే, అన్నీ ఆరోపణలే భరిస్తున్న-ఈ మధురై శైవమత చిన్న స్వాములవారికి-ఎటు పోయినా కష్టాలే!
వన్య్రపాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం పులి చర్మాలు ధరించడం, ఏనుగు దంతాలు దగ్గరపెట్టుకుని ఉండడం-రెండూ నేరమే. శైవపీఠంలో- ‘సాములోరు’ పులిచర్మం మీద ఆసీనుడై ఉండగా పోలీసులు పట్టుకుని, కేసు బుక్ చేశారు. పైగా ఈ ఆశ్రమాన్ని కూడా మేం ‘గాలిస్తాం, మాకనుమతి కావాలం’ టూ కోర్టుకెక్కారు- గవర్నమెంటు ఉద్యోగులైన పోలీసులు. కానీ, స్వాములవారు సదా నిత్యానందంగానే నవ్వుతూ కనబడతారు. ఆయనతోపాటు అక్కడే వున్న మాజీ సినీతార- రంజితనీ, మరో అధికారిణి (ప్రజాసంబంధిత) కూడా పోలీసులు ‘బుక్’ చేశారు. పాపం! ఈ నిత్యానందుల వారి కష్టాలు నిత్యనూతనాలు! తీరుతాయో లేదో...?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more