Jac rejected rayala telangana proposal

Telangana JAC chairman Kodandaram rejected Rayala Telangana proposal. It is said that Congress high command has prepared to solve

Telangana JAC chairman Kodandaram rejected Rayala Telangana proposal. It is said that Congress high command has prepared to solve

JAC rejected Rayala Telangana proposal.gif

Posted: 06/28/2012 03:55 PM IST
Jac rejected rayala telangana proposal

Kodandaramరాష్ట్రానికి కంటిమీద కనుకులేకుండా చేస్తున్న తెలంగాణ అంశాన్ని, ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన అధిష్టానం మదిలో మళ్ళీ మెదిలినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే... త్వరలో తెలంగాణ అంశానికి ఏదో ఒక పరిష్కారం కనుగొనే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందని తెలుస్తుంది. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని, ఈసారి స్పష్టమైన ఫార్ములా రూపొందించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో... వయలార్ పలు ప్రాంతాల నేతలతో భేటీ అవుతున్నారు. ఈ భేటీకి అధిక ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల తెలంగాణతోపాటు పలు ప్రతిపాదనలపై వారు చర్చించినట్లు తెలిసింది.

తెలంగాణ అంశం పై కదలిక వచ్చింది అనగానే... ‘‘బెల్లం చుట్టు ఈగలు ముసిరినట్లుగా’’ దీని చుట్టు అనే వివాదాలు చుట్టుముడుతాయి ఇది ఎప్పటి నుండో జరుగుతున్న తంతు. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, రాయల తెలంగాణ అయినా అభ్యంతరం లేదని గండ్ర అన్నారు. దీనికి పలువురు నేతలు కూడా సుముకంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ వ్యాఖ్యల పై స్పందించిన తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్..... ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణకి ఒప్పుకునేది లేదని, ప్రజలు పోరాడింది రాయల తెలంగాణ కోసం కాదని అన్నారు. గండ్ర మాటలను ఖండిస్తూ ఆయన దిష్టి బొమ్మను తగల బెట్టాలని పిలుపునిచ్చారు. జూలై 7వ తేదీన జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కోదండరామ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baltic sea ufo disables equipments within 200m range
Jagan bail decision postponed to july 4  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles