Call record leaked to undermine me cbi joint director

Call record leaked to undermine me: CBI joint director,mobile call data, V.V. Lakshminarayana, Y.S. Jagan Mohan Reddy,VV Lakshminarayana,Krishna Raju,EMAAR,Congress,CBI Joint Director

Call record leaked to undermine me: CBI joint director

director.gif

Posted: 06/28/2012 11:28 AM IST
Call record leaked to undermine me cbi joint director

Call record leaked to undermine me: CBI joint director

చట్టవ్యతిరేకంగా తన ఫోన్‌కాల్ జాబితాను బయటపెట్టిన వారందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక రఘురామకృష్ణరాజు అనే పారిశ్రామిక వేత్త పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నందున సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఫోన్‌కాల్ జాబితాను బయటపెట్టి తన ఆత్మస్ధైర్యాన్ని దెబ్బదీసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆయన నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదును సిసిఎస్‌కు బదిలీ చేయగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  జెడి ఇచ్చిన ఫిర్యాదులో పలువురిపై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. రామకృష్ణంరాజు అనే పారిశ్రామిక వేత్త టెలికం శాఖ నుంచి కాల్ డేటా సేకరించడంలో ప్రముఖ పాత్ర వహించినట్లు అనుమానాలు వ్యక్తం చేశారని తెలిసింది. రామకృష్ణంరాజు కెవిపి రామచంద్రరావుకు బంధువు అని, జగన్ అరెస్టు విషయంలో మొదటి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు తనను బెదిరిస్తూనే ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

జగన్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి వైకాపా నేతలు ప్రతిసారి తనను ఏదోరకంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారని అన్నారు. టెలికం శాఖ కాల్ లిస్ట్‌ను బయటపెట్టిందని, కనీసం తన హోదాను, ప్రొటోకాల్‌ను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాల్ లిస్ట్, ఎస్‌ఎంఎస్‌లను చూపించి ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రామకృష్ణంరాజు ఈ ఏడాది జనవరిలో హైకోర్టులో సిబిఐ తనను వేధిస్తోందని, జెడి ఎవరెవరికి ఫోన్ చేసిందీ తన వద్ద కాల్ డేటా ఉందని కోర్టుకు చెప్పారని జెడి గుర్తు చేశారు. రాజు ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా కాల్ లిస్ట్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కాల్ లిస్ట్‌ను అడ్డం పెట్టుకుని తన ఫొటోను పదే పదే చూపిస్తూ, ఫోన్‌నెంబర్ల ఆధారంగా గంటల తరబడి సాక్షి న్యూస్ చానల్‌లో కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ను రాత్రి సిసిఎస్ అధికారులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీ మీడియా చేతికి దొరక్కుండా సిసిఎస్ అధికారులు జాగ్రత్త పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles