కాంగ్రెస్‌లో విలీనమైనప్పటి నుంచీ తనను, తనవర్గాన్ని చిన్నచూపు చూస్తూ అవమానకర రీతిలో వ్యవహరిస్తున్న రాష్ట్ర నాయకత్వంపై హైకమాండ్‌కు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయటానికి రాజ్యసభ సభ్యుడు, ప్రజారాజ్యం మాజీ అధినేత చిరంజీవి ఢిల్లీలో రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని బలపరిచే నామినేషన్‌పై సంతకం చేయటానికే ఆయన అధినాయకత్వం పిలుపుమేరకు వస్తున్నట్టు చెబుతున్నా, ఉప ఎన్నికలలో పార్టీ ఓటమితో సహా తాజా పరిణామాలను పార్టీ పెద్దలకు వివరించనున్నట్టు తెలిసింది. రాష్ట్ర దేవాదాయ మంత్రి సి రామచంద్రయ్య, రేవులు, ప్రాథమిక సదుపాయాలకల్పన మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఆయన వెంట వస్తున్నారు. ఉప ఎన్నికల వైఫల్యాన్ని పార్టీ అధినేత్రి సోనియా తీవ్రంగా పరిగణించి సిఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్సలకు క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. కిరణ్, బొత్సల పనితీరుపై ఇప్పటికే కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్టప్రతి ఎన్నిక తరువాత హైకమాండ్ రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో చిరంజీవి హైకమాండ్‌తో జరిపే చర్చలకు ప్రాధాన్యత సంతరించుకోనుంది. తాను ఖాళీ చేసిన తిరుపతిలో పార్టీ ఓడిపోవటాన్ని తప్పుపడుతూ కొంతమంది నేతలు ఎద్దేవా చేయటాన్ని కూడా చిరంజీవి తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అంతేకాక పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను వక్రీకరించి విమర్శలు గుప్పించటాన్ని కూడా చిరంజీవి జీర్ణించుకోలేక పోతున్నారు. వీటికి సంబంధించిన వాస్తవాలను నేడు అధిష్ఠానం ముందు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈమేరకు గట్టి సాక్ష్యాలను సిద్ధం చేసుకునే చిరు ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. తిరుపతి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంపిక తన ప్రమేయం లేకుండానే ఖరారు చేసిన విషయాన్ని చిరంజీవి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తారని తెలిసింది. చలన చిత్ర నటుడైన చిరంజీవికి ఉన్న జనాకర్షణను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి సంబంధించిన విషయాలపై తీసుకునే నిర్ణయాల్లో ఆయన్ని భాగస్వామి చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ స్వయంగా చేసిన సిఫార్సును రాష్ట్ర నాయకత్వం ఖాతరు చేయలేదు. ఎన్నికలకుముందు జగన్‌ను అరెస్టు చేయటం, మరోవైపు అవినీతి ఆరోపణలపై మంత్రిసహా సీనియర్ అధికారులు అరెస్టుకావటం, సామాజిక సమీకరణలకు విరుద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరగటం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పూర్తిగా నిరాశలో ఉండటంలాంటి కారణాలే పార్టీ ఓటమికి దారి తీశాయని చిరంజీవి వర్గం అభిప్రాయపడుతోంది.
ప్రజారాజ్యం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అసలు పట్టించుకోవటం లేదని చిరంజీవి హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చి, ఈ లోపాన్ని తక్షణమే కార్యచరణ రూపంలో సరిదిద్దని పక్షంలో తీవ్ర ఇక్కట్లు తప్పవన్న నిజాన్ని హైకమాండ్‌కు తెలియచేస్తారని రూఢీగా తెలిసింది. తమ పార్టీకి చెందిన అనేకమంది సీనియర్ నేతల రాజకీయ భవితవ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆజాద్ ఇచ్చిన హామీ ఇంతవరకూ అమలుకాని విషయాన్ని చిరంజీవి హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో విలీనమైనప్పటి నుంచి తమకు ఎదురైన అనుభవాలపై పార్టీ సీనియర్ నేతలు తయారు చేసిన సమగ్ర నివేదికను చిరంజీవి హైకమాండ్‌కు అందిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more