Cbi chargesheet likely in adarsh scam today

CBI chargesheet likely in Adarsh scam today,CBI, Adarsh Society Scam, Maharashtra,

CBI chargesheet likely in Adarsh scam today

CBI.gif

Posted: 06/28/2012 10:46 AM IST
Cbi chargesheet likely in adarsh scam today

ఆదర్శ్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. కేవలం ఫైళ్లపై సంతకం చేసానంతే..’ ఇదీ ఆదర్శ్ కుంభకోణంపై దర్యాప్తుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిషన్ ముందు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్ చెప్పిన మాట. రాష్ట్ర రెవిన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు క్లియర్ చేసిన తర్వాత మాత్రమే తాను ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసానని దేశ్‌ముఖ్ దర్యాప్తు కమిషన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ ఫైలు తన దగ్గరికి వచ్చినప్పుడు దానికి అప్పటి రెవిన్యూ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్‌లనుంచి క్లియరెన్స్ ఉండిందని దేశ్‌ముఖ్ కమిషన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖల మంత్రులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే తాను ఫైలుపై సంతకం చేసినట్లు కూడా ఆయన కమిషన్‌కు చెప్పారు. వరసగా రెండో రోజు కూడా దేశ్‌ముఖ్‌ను కమిషన్ ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విషయం వెల్లడించారు. విలాస్‌రావు దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వ భూమిని కేటాయించాలని, దానికి అదనపు ఎఫ్‌ఎస్‌ఐని మంజూరు చేయాలన్న నిర్ణయాలు తీసుకున్నట్లు దేశ్‌ముఖ్‌కన్నా ముందు కమిషన్ ఎదుట హాజరయిన కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో దేశ్‌ముఖ్, షిండే ఇద్దరు కూడా వివాదాస్పద ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఫైళ్లపై నిర్ణయాలు తీసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi to concentrate on ap politics
Congress target 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles