Husband who married off wife to her lover

husband who married off wife to her lover, padmamma, narasamma

husband who married off wife to her lover

husband.gif

Posted: 06/27/2012 04:42 PM IST
Husband who married off wife to her lover

 husband who married off wife to her lover

స్త్రీకి .. స్త్రీయే శత్రువు అని అంటారు. కానీ ఒక ఇల్లాలు .. కోరి  మరి .. సవతి పోరు తెస్తుకుంది.  ఏ మహిళైన ముందుగా కోరుకునేది.. తన భర్తకు.. మరో మహిళతో సంబంధం ఉండకూడదని కోరుకుంటుంది.  అలాగే  సవతి పోరు లేకుండా చూడమని  దేవుళ్లను కోరుకుంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ..  తన భర్త  మోసం చేసిన అమ్మాయికి న్యాయం చేసి గొప్ప ఇల్లాలు అనిపించుకుంది.  దానాల్లోకెల్లా గొప్పదానం గురించి పలు ఉదాహరణలు చూపిస్తుంటారు. మరి భర్తను మరో మహిళ కోసం దానం చేయడాన్ని ఏమంటారు?. భర్త చేసిన పొరపాటును చక్కదిద్దేందుకు ఓ ఇల్లాలు ఈ నిర్ణయం తీసుకుంది. తాను అన్యాయమైపోయినా, తోటి మహిళకు న్యాయం చేయాలని భావించిన ఆమె.. తన భర్తకు, అతడి ప్రియురాలితో పెళ్లి చేసేందుకు నిర్ణయించుకుంది. కలిసి సంసార జీవనం సాగిద్దామని ఆమెకు నచ్చజెప్పింది.

రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన చుక్కమ్మ ఇంట్లో ఆమె మేనకోడలు ఉంటోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ యువతి మేనత్త దగ్గర ఆశ్రయం పొందుతూ టీకొట్టులో పనిచేస్తోంది. గ్రామంలోని సిమెంట్ కర్మాగారం ముందున్న ధాబాలో కాలప్ప పని చేస్తున్నాడు. కాలప్పకు మల్కాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మతో వివాహమైంది. అయితే, ఎదురుగా టీకొట్టులోని యువతిపై కాలప్ప కన్నుపడింది. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. దీంతో ఆ యువతి నెలతప్పింది.

 husband who married off wife to her lover

ఆమెను మేనత్త ఇంట్లో నుంచి గెంటేసింది. ఆ యువతి తనను మోసం చేసిన కాలప్ప భార్య పద్మమ్మ వద్ద కెళ్లి మొరపెట్టుకుంది. తనకిక ఆత్మహత్యే శరణ్యమని కన్నీరు పెట్టుకుంది. ఆ యువతి కన్నీరును చూసిన పద్మమ్మ.. "నా భర్తతో నీకు వివాహం జరిపించి న్యాయం చేస్తానని.. ఆత్మహత్య చేసుకోవద్దని ధైర్యాన్ని చెప్పింది. ఆమెకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. భర్తకు పెళ్లి చేసుకోవాలంటూ నచ్చజెప్పింది.. చివరకు భర్త, ప్రియురాలికి పెళ్లి చేసి.. గొప్ప ఇల్లాలు అనిపించుకుంది పద్మమ్మ. ముగ్గురు కలిసి కాపురం చేయటానికి సిద్దమైనట్లు  పద్మమ్మ చెబుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ranjethmalani argument in ys jagan case
Latest study on controversial weight loss drug promoted on dr oz revealed this week  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles