బిజెపి-కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రణబ్ పై పోటీకి దిగడాన్ని బీజేపీ సమర్థించుకుంది. అధికార యూపీఏపై పోటీ నిర్ణయం సబబేనంటోంది. ఎన్నికల్లో పోటీ ప్రజాస్వామ్యానికి మంచిదని అందుకే ఎన్డీఏ తరపున సంగ్మా పోటీ చేస్తున్నారంటోంది. మరోవైపు పార్టీలకతీతంగా మద్దతు కూడగడుతోన్న ప్రణబ్ ఓటింగ్ లో కూడా తనకు సహకరించాలని ప్రచారం ప్రారంభించారు.
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ బరిలోకి దిగిన మాజీ లోక్ సభ స్పీకర్ పి.ఎ. సంగ్మా అభ్యర్థిత్వానికి బీజేపీ మద్దతిస్తోంది . రాష్ట్రపతి ఎన్నికలో ఏకాభిప్రాయ సాధనకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తమతో అభ్యర్ధి విషయంలో సంప్రదింపులు జరిపేందుకు చొరవ చూపలేదని బిజేపీ విమర్శిస్తోంది. దీనికితోడు యూపీఏ తరఫు అభ్యర్థి ఆర్థిక మంత్రి కావడం కూడా తమ పోటీకి కారణమన్నారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ప్రణబ్ విఫలమయ్యారని, విదేశాల్లోని భారతీయుల నల్లధనం వివరాలను ప్రకటించేందుకు ఆయన నిరాకరించారని బిజెపి ద్ మండిపడుతోంది. మరోవైపు సంగ్మాకు తృణమూల్ చీఫ్ మమత కూడా మద్దతివ్వాలని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సూచించారు.
రాష్ట్రపతి రేసులో వెనుకబడిపోతున్న సంగ్మా మాటల యుద్ధానికి తెరతీశారు. దేశ ఆర్థిక పరిస్థితులపై రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రణబ్ తనతో చర్చకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థికరంగం దిగజారడానికి ఊహకందని రీతిలో కుంభకోణాలు చోటుచేసుకోవడానికి కారకులెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చల అవసరం ఉందని అందువల్ల ఈ అంశంపై బహిరంగ చర్చకు ప్రణబ్ ముందుకు రావాలని సంగ్మా డిమాండ్ చేశారు.
అయితే ఈ సవాల్ ను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దేశ ఆర్థికరంగాన్ని రాష్ట్రపతి నడపరని అందువల్ల ఈ సవాల్ పై చర్చే ఉత్పన్నం కాదంటోంది. అటు రాష్ట్రపతి రేసులో సంగ్మా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎన్సీపీకి మేఘాలయలో ఆ పార్టీకి చెందిన మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారు. పార్టీ వైఖరికి నిరసనగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. సంగ్మా కుమారుడు, మేఘాలయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కాన్ రాడ్ సంగ్మా నిర్వహించిన అత్యవసర సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్సీపీ మేఘాలయ విభాగం చీఫ్ ఖర్లూకీ చెబుతున్నారు.మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచార పర్వానికి సిద్ధమవుతున్న ప్రణబ్ పశ్చిమబెంగాల్ లో పావులుకదిపి ముందుకు సాగుతున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more