రాబోయే 15 రోజుల్లో కర్నాటక గాలి ఆగిపోతుంది. అంటే జైల్లో వున్న కర్నాటక కుభేరుడు మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి ఆస్తులను జప్తు చేయటానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. జైల్లో వున్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డికి మరిన్ని కష్టాలు తప్పడం లేదు. ఆయన ఆస్తులన్నింటినీ జప్తు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) రంగం సిద్ధం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. మరో 15రోజుల్లో గాలి ఆస్తులను జప్తు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరులో గాలి జనార్ధన రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెంగళూరు సెంట్రల్ జైల్లో వున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా ఏకంగా రు.884కోట్లు కూడబెట్టాడని సిబిఐ పేర్కొంటోంది. అందువల్ల ఈ డబ్బుకి బళ్లారీలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి)తో సహా గాలి కంపెనీలకు మధ్య గల సంబంధాలేంటో నిర్ధారించడానికి ఈడి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడి వద్ద ఓఎంసితో సహా 15కంపెనీల జాబితా వుంది. ఈ కంపెనీల్లో అక్రమంగా సంపాదించిన సొమ్మంతా పెట్టుబడి పెట్టివుంటారని అనుమానిస్తున్నారు. ఈ కంపెనీలకు గాలి జనార్ధన రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస రెడ్డి, గాలి భార్య లక్ష్మి రెడ్డి జాయింట్ డైరెక్టర్లుగా వున్నారు. కాగా ఈడి ఇప్పటికే శ్రీనివాస రెడ్డిని విచారించింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న మరికొంతమంది ఎంఎల్‌ఎలను కూడా ఇంటరాగేట్ చేసింది. వచ్చే రెండు రోజుల్లో గాలిని ప్రశ్నించే అవకాశం వుంది. గాలి జ్యుడీషియల్ కస్టడీని సిబిఐ కోర్టు జులై 2వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more