Tollywood legend actor ntr

Tollywood Legend Actor NTR, N.T. Rama Rao, Sr. NTR Birthday Special,NTR 89th Birthday Celebrations ,

Tollywood Legend Actor NTR,

NTR.gif

Posted: 05/29/2012 10:27 AM IST
Tollywood legend actor ntr

Tollywood Legend Actor NTR

తెలుగు సిని వినీలాకాసం లో తిరుగులేని విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు

ఆయనే యన్. టీ. ఆర్... ఒక అసమాన నటుడిగానే కాక, ఒక విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఒక అనంత శక్తి గా ఎదిగిన... భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలుగు సినిమా ఉన్నంత వరకు, యావత్ ఆంద్ర ప్రదేశ్ కి, ఆడపడుచులందరికీ 'అన్న' గా గుర్తుండిపోయే మహా నటుడు నందమూరి తారక రామ రావు...

పౌరాణికం, సాంఘికం, యాక్షన్, ఇలా ఒకటేమిటి, విభిన్న చిత్రాలలో, వైవిధ్యమైన పాత్రలు... రాముడు, కృష్ణుడు అంటే అన్నగారి లాగే ఉంటారు అని ఈ రోజు కి మనం నమ్మేంతగా నటించిన ఈ మహా నటుడు, అటు భీముడిగా, దుర్యోధనుడిగా, సర్దార్ పాపరాయుడిగా కూడా తన నటనా కౌశల్యాన్ని పరిచయం చేసారు... ఇక, గోల్డెన్ ఏరా గా పేర్కొనే యాభైయ్యవ శతకం లో మరచిపోలేని, సమాజాన్ని ఈ రోజు కి ఆలోచింప చేసే ఎన్నో సాంఘిక, కుటుంబ కథా చిత్రాలలో ఆయా పాత్రలలో ఒదిగిపోయారు అన్న గారు...

Tollywood Legend Actor NTR

'మిస్సమ్మ', 'గునమ్మ కథ' వంటి మల్టీ స్టారర్ సినిమాలైనా, ఇక నాటి నుండి నేటి వరకు సమాజం యొక్క ప్రశాంతతని హరించే భేషజాల పై వచ్చిన 'వరకట్నం', 'తలల - పెళ్ళామా' వంటి సినిమాలైన, ఇక కుటుంబ విలువలు చెప్పే 'రక్త సంబంధం', 'కలసి ఉంటె కలదు సుఖం' ఇలా చెప్పుకుంటూ పొతే అన్నగారు నటించిన సినిమాలు కోకొల్లలు... ఇక రాముడిగా, కృష్ణుడిగా, అన్నగారిని ఒక దైవ స్వరూపం గా కొలిచేవారు అభిమానులు...

Tollywood Legend Actor NTR, N.T. Rama Rao, Sr. NTR Birthday Special

యెంత పెద్ద డైలాగ్ అయినా, ఎన్ని కటినమైన పదాలు ఉన్న, గుక్క తిప్పుకోకుండా సింగిల్ టెక్ లో ఓకే చేసేవారట అన్నగారు... 'దాన వీర సూరా కర్ణ' లో లో ఈ మహా నటుడి డైలాగ్ ఈ రోజుకి ఎంతటి ప్రాచూర్యం సంపాదిన్చుకుందో, 'సర్దార్ పాపారాయుడి'గా, ప్రేక్షక లోకాన్ని అబ్బురపరిచే అన్నగారి నటన మరువలేనిది...

Tollywood Legend Actor NTR, N.T. Rama Rao, Sr. NTR Birthday Special

మీకు తెలుసా, దాసరి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా, యాడాదికి పైగా ఆడిన పది తెలుగు సినిమాల్లో ఒకటి... ఈ సినిమా నిర్మాణ వ్యయం యాభై లక్షలు... విడుదలైన వారానికే కోటి కి పై చిలుకు వసూలు చేసిందీ సినిమా... సమాజానికి ఒక సవాలు గా నిలిచిందీ సినిమా... ఈ సినిమాలో ఇరవై నిమిషాల పాటు సాగే పతాక సన్నివేశం హైలెట్... అన్నగారు ముప్ఫై అయిదు పేజీల డైలాగ్ ని అద్భుతమైన హావ భావాలతో, గంభీర చెప్తారు... షూటింగ్ స్పాట్ లో మూడు గంటల పాటు కూర్చుని ఈ డైలాగ్లు రాసారట దాసరి, అన్నగారు, షూటింగ్ స్పాట్ కి దగ్గరలో ఉన్న మరీనా బీచ్ (చెన్నై) కి వెళ్లి, డైలాగ్లు మననం చేసుకొని, తిరిగి వచ్చి సింగిల్ టెక్ లో మొత్తం షాట్ ని ఓకే చేసారట... ఇంతటి ఏక సంతాగ్రహి కాబట్టే 1940 లలో విడుదలైన 'మనదేశం' సినిమాలో చిన్న కానిస్తాబ్లె పాత్ర తో తన సిని ప్రస్థానాన్ని మొదలు పెట్టి, తిరుగులేని నటుడిగా ఎదిగారు అన్న గారు...

Tollywood Legend Actor NTR, N.T. Rama Rao, Sr. NTR Birthday Special

ఇంతేకాక, జానపద సినిమాలలోనే చరిత్ర సృష్టించిన 'జగదేకవీరుని కథ', 'పాతాళ భైరవి' వంటి సినిమాలు, ఈ రోజుకి ఎంతో మంది దర్శకులకి, నటులకి ఆదర్శం అనే చెప్పాలి...

Tollywood Legend Actor NTR, N.T. Rama Rao, Sr. NTR Birthday Special

ఇలా చెప్పుకుంటూ పొతే అన్న గారు సాధించిన విజయాలెన్నో, రాబోయే తరం నటులకి కూడా ఆదర్శవంతంగా నిలిచేలా పోషించిన పాత్రలెన్నో... ఈ రోజు, ఈ విశ్వ విఖ్యాత నట సార్వభౌముది జయంతి... ఎల్లకాలం ఈ 'కారణ జన్ముడు' మన మదిలో నిలిచిపోయేలా, రాబోయే నటులకు ఆదర్శంగా నిలిచేలా కోరుతూ, మరొక్కసారి ఈ అద్భుత నటుడికి నమస్సుమాంజలి తెలుపుతోంది ఆంద్రవిషేష్...

సునయన వినయ్ కుమార్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party leaders attack on bus
Ys jagan mohan reddy arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles