Tsr image a big boost

TSR image, a big boost,byelection, Nellore, T. Subbarami Reddy

TSR image, a big boost

TSR.gif

Posted: 05/24/2012 10:45 AM IST
Tsr image a big boost

TSR image, a big boost

నెల్లూరు లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. పెద్దపెద్ద డిజిటల్ స్క్రీన్లపై ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భారీ వాహనాలను ఏర్పాటుచేసుకుని వాటిపై డిజిటల్ స్క్రీన్లను అమర్చి రద్దీగా ఉండే కూడళ్లలో ప్రచార ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రచారాన్ని మాత్రం వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నారు. ఆ కోవలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తిక్కవరపుసుబ్బరామిరెడ్డి ఈ నెల 6న న తన లలిత కళాపరిషత్ ద్వారా నెల్లూరు నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీతారలంతా తరలివచ్చి టిఎస్‌ఆర్‌ను ఆకాశానికి ఎత్తి పొగడ్తల వర్షం కురిపించిన ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై వీధివీధినా ప్రదర్శిస్తున్నారు. తొలుత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ తొలి ప్లీనరీ సమావేశంలో జగన్ ప్రసంగాలు, గతంలో జరిగిన ఇతర కార్యక్రమాల్ని డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహించగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లను తెప్పించి టిఎస్‌ఆర్ ప్రచారాన్ని విస్తృతం చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gary downey
Tdp chandrababu naidu vs trs k chandrashekar rao kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles