Really cyber wars that threaten global security

really cyber wars that threaten global security?, cyber security, cyber-policing, cybercrime, Europe, hackers, hacking, Internet crime, online theft, professional programmers,

really cyber wars that threaten global security?

cyber.gif

Posted: 05/18/2012 11:14 AM IST
Really cyber wars that threaten global security

cyber-wars

ఉగ్రవాదులు తమ దాడులకు తాజాగా అందుబాటులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటి) టూల్స్‌ను వినియోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముంబయిపై దాడికి సంబంధించిన మొత్తం పథకాన్ని ఉగ్రవాదులు గూగుల్ ఎర్త్ ద్వారా రూపొందించారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు తమ దాడులకు సైబర్ వ్యవస్థను అత్యంత అనువుగా వాడుకుంటున్నారని, ముంబయిపై లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు జరిపిన దాడి ఇందుకు ఉదాహరణ అని అమెరికాకు చెందిన ఒక ఉన్నత స్థాయి కమాండర్ పేర్కొన్నారు. దీనికోసం వారు ఎలాంటి వ్యయం చేయలేదని అమెరికా మెరైన్ కాప్స్ లెఫ్టినెంట్ జనరల్ జార్జ్ ఫ్లిన్ తెలిపారు. వర్జీనియా బీచ్‌లో జరిగిన ఆరవ 2012 జాయింట్ వార్‌ఫైటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ముంబయిపై దాడి సందర్భంగా ఉగ్రవాదులు కమాండ్ చేయడానికి, నియంత్రణకు సెల్యులర్ ఫోన్లు వినియోగించారని, ఇండియన్ కమాండోల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. భారీ స్థాయిలో చేసిన ఉగ్రవాద దాడికి వారు ఎంత టెక్నాలజీని ఉపయోగించుకున్నారు? ఎంత డబ్బు వ్యయం చేశారు? అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు తమ దాడికి పథకాన్ని రూపొందించి, అమలు చేయడానికి ఖర్చులేని, సాధారణంగా లభ్యమయ్యే ఆస్తులను ఉపయోగించుకున్నారని ఆయన వివరించారు. మార్పు వేగం పెరుగుతున్నందున హోమ్‌లాండ్ ప్రస్తుతం యుద్ధ క్షేత్రంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party
Dcc chief falls from cm convoy injured  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles