Kiran confident of completing term

Kiran confident of completing term,India,Andhra Pradesh, by-election, unfinished goals, election meeting,cm kiran , bosta, vayalar ravi,

Kiran confident of completing term

Kiran.gif

Posted: 05/18/2012 10:21 AM IST
Kiran confident of completing term

Kiran confident of completing term

ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం అదేరీతిలో కొద్దిరోజులుగా రాష్ట్రనేతలను కూడా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుండి ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి కృష్ణమూర్తిని హైదరాబాద్‌లో ఉంచడంతో పాటు నేతల ప్రచారం తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడికక్కడ ఉన్న లోపాలను సరిదిద్దేపనిలో నిమగమైంది. రాష్ట్రనేతలపైనే బాధ్యత మోపకుండా కేంద్రం నుండి ముఖ్యనేతలు కూడా ప్రచారపర్వంలోకి సోనియాగాంధీ దించుతున్నారు. ఉపఎన్నికలపై దూకుడుగా ఉండాలని కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం నేతలకు సూచించింది. జగన్‌ విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని, వైఎస్సార్‌ కుమారుడన్న సానుభూతి చూపకూడదని, పార్టీని రక్షించుకునేందుకు దేనికి వెనుకాడొద్దని ఉపఎన్నికల పరిశీలకుడు, కేంద్రమంత్రి వయలార్‌ రవి ద్వారా తెలియజేసింది. వయలార్‌రవి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన అల్పాహారవిందులో సిఎం కిరణ్‌, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమైనప్పుడు ఇదేరీతిన ముందుకెళ్ళాలని రవి సూచించారు. వాస్తవరూపంలో చెబితే అవినీతిని ప్రజలు సహించబోరని, ప్రస్తుతం ప్రదర్శిస్తున్న దూకుడును కొనసాగించాలని చెప్పారు. సిఎం కిరణ్‌ ఉపాన్యాసాలను అభినందిస్తూనే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా రానీయకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో నేతలను సమన్వయపరిచే బాధ్యతలను బొత్సకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dcc chief falls from cm convoy injured
Nallari kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles