May 28th is the bad day for ys jagan

may 28th is the bad day for ys jagan..?

may 28th is the bad day for ys jagan..?

15.gif

Posted: 05/17/2012 02:46 PM IST
May 28th is the bad day for ys jagan

       అక్రమాస్తుల కేసులో  సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 28న న్యాయస్థానానికి హాజరు కావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.. జగన్ ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరో రోజు వచ్చేందుకు అనుమతించాలని కోర్టుకు విన్నవించుకునే అవకాశముంది. అయితే... 28న కోర్టుకు రాకుంటే... కేసులకు భయపడుతున్నారనే సంకేతాలు వెళతాయని, అందుకే అదే రోజు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ మద్దతుదారులు పెదవి విరుస్తున్నారు లేనిపోని పంతాలు భవిష్యత్తుని అంధకారమయం చేస్తాయనేది వారి భయంగా కనిపిస్తోంది.ys_janga   
     ఎందుకంటే.. 'మే 28'వ తేదీ జగన్ కు అచ్చిరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలు మదనపడుతున్నారు.  దీనికి కారణంలేకపోలేదు.. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు జగన్ ఓదార్పు యాత్ర కోసం వరంగల్ జిల్లా మహబూబాబాద్ (మానుకోట) బయలుదేరారు. తెలంగాణవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. మానుకోట రైల్వే స్టేషన్‌లో రాళ్ల వర్షం, కాల్పులు, గందరగోళం నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి పోలీసులు జగన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. అదే సంఘటనకు నిరసనగా  'రెండేళ్ల మానుకోట ఘటన' పేరుతో 28వ తేదీన తెలంగాణ జేఏసీ ప్రదర్శనలు, పాదయాత్రలు నిర్వహిందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాక, ఇదే రోజు జగన్ కోర్టుకు హాజరవటం ఏ కీడు చేస్తుందో అని జగన్ పార్టీనేతలు వాపోతున్నారు. వీటన్నిటికీ తలవంచి జగన్ కోర్టుకు హాజరవుతారో లేక మొఖం చాటేస్తారో చూడాలి. మొత్తంగా రాజకీయవర్గాలేకాదు.. రాష్ట్రప్రజలు ఈనెల 28 వ తేదీకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Plains crash in pakistan
Chiranjeevi lashed out at ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles