A yuva branch the young can bank on

A Yuva branch the young can bank on,Hyderabad, SBI, SBI Yuva, Youth, Coffee shop

A Yuva branch the young can bank on

SBI.gif

Posted: 05/11/2012 06:06 PM IST
A yuva branch the young can bank on

A Yuva branch the young can bank on

ఎస్‌బిఐ యువ పేరుతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ శాఖను ఆ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ రాకేష్ శర్మ ప్రారంభించారు. యువ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ప్రత్యేక శాఖను నెలకొల్పింది. అన్ని వర్గాల యువత కోరుకునే వసతులతో ఈ బ్యాంకు శాఖను తీర్చిదిద్దామని, మిగతా శాఖల మాదిరిగానే బ్యాంకు ఉత్పత్తులన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆధునిక వసతులతో ఈ శాఖను ఏర్పాటు చేసినప్పటికీ మిగతా శాఖలకన్నా ఎక్కువ మొత్తమేమీ వెచ్చించలేదని ఆయన చెప్పారు. ఈ శాఖ ద్వారా ఏడాది కాలంలో 100 కోట్ల రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. యువ శాఖ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేస్తుందని, ఉద్యోగులకు అనుగుణంగానే పని వేళలను మార్చినట్టు ఆయన తెలిపారు.

ఎస్‌బిఐ యువ శాఖ సాధారణ శాఖలతో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంది. ఈ శాఖలో కాఫీ కార్నర్, బుక్ కార్నర్, గేమింగ్ జోన్, వైఫై కనెక్టివిటీ, మ్యూజిక్ కార్నర్ ఉన్నాయి. ఈ శాఖలో మొబైల్ ఫోన్లను కూడా విక్రయిస్తుండటం విశేషం. శాఖలోకి ప్రవేశించగానే ముందు ఇవే దర్శనమిస్తాయి. సాధారణ శాఖల్లో ఉన్న మాదిరిగా కాకుండా ఫ్రెండ్‌తో చిట్ చాట్ చేస్తూ బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. ఇందులోని సెల్ఫ్ సర్వీసింగ్ కియోస్క్ ద్వారా పాస్ బుక్‌లో లావాదేవీలను ప్రింట్ చేసుకోవడమే కాకుండా నగదును డిపాజిట్ కూడా చేయవచ్చు. ఎన్ఇఎఫ్‌టి/ఆర్‌టిజిఎస్ ద్వారా ఇతర ఖాతాలకు నగదును పంపవచ్చు. బిల్లులు కూడా చెల్లించవచ్చు. వెయ్యి రూపాయలతోనే ఈ శాఖలో ఖాతాను తెరవచ్చు. ఎటిఎంను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఇతర వృత్తి నిపుణులకు దృష్టిలో ఉంచుకుని ఈ శాఖను తీర్చిదిద్దారు. ఈ బ్రాంచ్‌లో కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ అకౌంట్లను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ శాఖలోని సిబ్బంది కూడా యువతే కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Janardhan reddy gets bail in mining case
Women s sexual appetite peaks at 11pm on saturday night  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles