Women feel unsafe in night shifts

Forty-eight per cent of women doing night shifts in IT, BPO firms in city feel unsafe, says survey

Forty-eight per cent of women doing night shifts in IT, BPO firms in city feel unsafe, says survey

Women feel unsafe in night shifts.gif

Posted: 05/09/2012 06:10 PM IST
Women feel unsafe in night shifts

Women-feel-unsafeభారత్ కి స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటినా ఇంకా గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని మనం నిర్మించుకోలేకపోతున్నాం. అలాగే ‘ "అర్ధరాత్రి మహిళలు ఒంటరి గా తిరిగినప్పుడే నిజంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు'' ..అని గాంధీజీ అన్నారు. కానీ ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే మనకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదనే చెప్పాలి. ఈ అం శంపై దేశవ్యాప్తంగా అసోచామ్ నిర్వహించిన సర్వే లో 73 శాతం మంది మహిళలు రాత్రి వేళల్లో పనిచేసేటప్పుడు తాము తీవ్ర అభద్రతకు గురవుతున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అని లేదు. దేశంలో ప్రధాన నగరాలన్నిటా ఇదే పరిస్థితి.

ఈ సర్వే ప్రకారం.. దేశంలో మహిళలకు భద్రతలేని అత్యంత అరక్షిత మెట్రోనగరం ఢిల్లీనేనని తేలింది. తర్వాతి నాలుగుస్థానాల్లో వరుసగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై నిలిచా యి. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో వివిధ సంస్థ ల్లో పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగులను ప్రశ్నించారు. ఆ నివేదిక ప్రకారం.. బీపీవోలు (బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్‌సోర్సింగ్), ఐటీ రంగం, ఆతిథ్య రంగం, మీడియా.. ఇతర రంగాల్లో కన్నా వీటిలో పనిచేసే మహిళలపై మానసిక, శారీరక దాడులు అత్యధికం. అదీ.. రాత్రిపూట పనివేళల తర్వాత! రాత్రివేళ్లల్లో విధులు నిర్వర్తించే మహిళలకు సరైన రవాణా సౌకర్యం కల్పించకపోవడం, వారి భద్రతకు అవసరమైన చర్యలు సరిగా చేపట్టకపోవడం, అధికారుల మొండితనం వల్ల మహిళలపై అత్యధిక క్రైమ్ రేటుకు కారణం.  చిన్న తరహా సంస్థల్లో పనిచేసే మహిళలు ఎక్కువగా (21 శాతం) మానసిక వేధింపులకు గురవుతున్నారు. మధ్యతరహా సంస్థల్లో ఇది 14 శాతం కాగా.. పెద్ద సంస్థల్లో 8 శాతం మంది మహిళలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.  మరి దేశ రాజధాని ఢిల్లీలోనే మహిళలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాలు దేశంలోని మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాయి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India is fourth worst in maternal care
Pavn gabbar singh special benefit show ticket rate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles