Vasireddy padma vs shoba himavati

Vasireddy padma.GIF

Posted: 05/02/2012 09:41 PM IST
Vasireddy padma vs shoba himavati

గతంలో మాటిమాటికి కాంగ్రెస్ పార్టీలో గంగాభవాని, తెలుగు దేశం పార్టీలో నన్నపనేని రాజకుమారి కయ్యానికి కాలుదువ్వేవారు. కానీ ఇప్పుడు వారి లొల్లి వినబడటం లేదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనుండి వాసిరెడ్డి పద్మ, తెలుగు దేశం పార్టీనుండి శోభా హైమావతులు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. ఒకరి పై ఒకపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు.

తెలుగు దేశం పార్టీ కి చెందిన శోభ హైమావతి వైయస్సార్ పార్టీ కి చెందిన వాసిరెడ్డి పద్మ పై విరుచుకుపడ్డారు. జీతం తీసుకొని పెయిడ్ వర్కర్‌గా పనిచేస్తున్న పద్మ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, వైఎస్సార్ పార్టీలో పద్మ నెలకు రూ. 70 వేలు జీతం తీసుకొని పనిచేస్తున్నారని అన్నారు.  చంద్రబాబును తిడితే తన జీతం పెరుగుతుందని ఆమె అనుకుంటే భ్రమే అవుతుంది. మాకు మాటలు రాక కాదు...సభ్యత అడ్డు వచ్చి మాట్లాడటం లేదు. ఆమె నోరు అదుపులో పెట్టుకోకపోతే వెంటపడి కొట్టాల్సి వస్తుంది' అని శోభా హైమావతి అన్నారు. జగన్ పార్టీలో ఐరన్ లెగ్ మాదిరిగా ఉన్న రోజా కూడా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని, తనను తుక్కు కింద గుర్తించి పక్కన పడేశారని ఆమె తెలుసుకుంటే మంచిదని శోభ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj doesnt want to be reminded about his illness again
Coming soonpost bank of india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles