Mysura reddy to join ys jagan party

Mysura Reddy To Join YS Jagan party. Mysura Reddy, YS Jagan, TDP, YSR Congress, YSR C, Congress, Telugu Desam Party, Telugu Desam, Andhra Pradesh, Andhra Politics, Politics, Rajya Sabha, AP

Mysura Reddy To Join YS Jagan party. Mysura Reddy, YS Jagan, TDP, YSR Congress, YSR C, Congress, Telugu Desam Party, Telugu Desam, Andhra Pradesh, Andhra Politics, Politics, Rajya Sabha, AP

Mysura Reddy To Join YS Jagan Party.GIF

Posted: 05/01/2012 11:18 AM IST
Mysura reddy to join ys jagan party

Mysura-reddyతెలుగు దేశం పార్టీకి పంచ్ మీద పంచ్ పడుతుంది. ఆ పార్టీలో ఉన్న ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా వైయస్సార్ కాంగ్రెస్ లోకి, ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. మొన్నటికి మొన్న పేర్వారం రాములు, గద్దె బాబురావులు వైయస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే క్రిష్ణ జిల్లా నుండి వల్లభనేని వంశీ ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైయస్సార్ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత మైసూరా రెడ్డి కూడా త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మైసూరా రెడ్డి సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మరో దఫా రాజ్యసభ అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన బాబుపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయన జగన్ వైపు వెళతారా అనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గత మూడు రోజులుగా చంద్రబాబు కడప జిల్లా ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో పర్యటించారు. ఆ జిల్లాకే చెందిన నేత అయినప్పటికీ మైసూరా ప్రచారంలో ఎక్కడా పాల్గొనలేదు. ఆయన మేనత్త మరణించారని, అందుకే ఆయన పాల్గొనలేదని కొందరు చెబుతున్నారు. కానీ చంద్రబాబును మాత్రం కలవలేదని అంటున్నారు.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆయన టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెసులో చేరతారా అన్న ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది. రెండోసారి చంద్రబాబు తనకు రాజ్యసభ ఇవ్వకపోవడంతో మైసూరా రెడ్డి ఇక రాజకీయాలకు స్వస్తీ చెప్పి తన బిజినెస్ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉందనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ తాజాగా జగన్ వైపు వెళతారనే ప్రచారం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petition in madras high court against sachin
Assam ferry disaster leaves 200 dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles