Sridevi gang arrested guntur

Guntur district police have busted another high level gang, which is blackmailing customers recording videos. A Chennai based woman, Sridevi and other were arrested. It is the rocket like Tara Chowdary's in Hyderabad

Guntur district police have busted another high level gang, which is blackmailing customers recording videos. A Chennai based woman, Sridevi and other were arrested. It is the rocket like Tara Chowdary's in Hyderabad

sridevi-gang-arrested-guntur.gif

Posted: 04/12/2012 12:16 PM IST
Sridevi gang arrested guntur

మన రాష్ట్రంలో గతంలో ఎన్నో వ్యభిచార ముఠాల గుట్టు రట్టయినా, తాజాగా వ్యభిచారం కేసులో అరెస్టయిన తారా చౌదరి వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనం కలిగిస్తుంది. ఆ సంఘటన విచారణలో ఉండగానే గుంటూరులో మరో (తారా చౌదరి) శ్రీదేవి ముఠా అనే వ్యభిచార గుట్టు రట్టయింది. తారా చౌదరి అమ్మాయిలను వ్యభిచారంలోకి దించి, వారి రాసలీలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో గుంటూరులో శ్రీదేవి ముఠా కూడా అచ్చం తారా లాగే బ్లాక్ మెయిల్ చేస్తూ పట్టుబడింది. ఈమె నెట్ వర్క్ మన రాష్ట్రంలోనే కాకుండా డిల్లీ నుండి గల్లి వరకు మన హైదరాబాద్ లో కూడా విస్తరించి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

గుంటూరు జిల్లా గురజాల మాజీ శాసనసభ్యుడు కాయితి వెంకట నర్సిరెడ్డికి గతనెల 20 నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపుఫోన్లు వచ్చాయి. 10 లక్షలు ఇవ్వకుంటే మీకు సంబంధించి అశ్లీల దృశ్యాలను మీడియాకు విడుదల చేస్తామని, నెట్ లో ఉంచుతామని బెదిరించారు. దీంతో ఆయన గత నెల 26న గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా వ్యవహారం వెలుగు చూసింది.గతంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ పత్రిక ప్రకటనల విభాగంలో పని చేసిన మెటపోతుల కేశవరావు, తనకు పరిచయం ఉన్న విజయవాడకు చెందిన న్యాయవాది చింతల రాంప్రసాద్, చెన్నైకి చెందిన శ్రీదేవితో ముఠా ఏర్పాటు చేశాడు. ప్రముఖులను గుర్తించి వారి సెల్‌కు శ్రీదేవితో ఫోన్‌లో మాట్లాడించి ట్రాప్ చేస్తారు. తరువాత వారిని పిలిపించుకుని శృంగార కార్యకలాపాల్లో ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్ చేస్తారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నిమ్స్‌ కు చెందిన వైద్యుడ్ని బెదిరించి 13 లక్షల వరకు వసూలు చేశారు. తరువాత ఢిల్లీలో కేంద్ర మంత్రిత్వశాఖలో పనిచేసే పీఏ ఓజా, పార్లమెంట్‌లో పనిచేసే మణిపాల్ యాద వ్, తబలా అనే వారితోపాటు గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట నర్సిరెడ్డి తదితరులను ఇదే తరహాలో బ్లాక్‌మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ముఠా సభ్యులు కేశవరావు, చింతల రాంప్రసాద్‌ను కొద్దిరోజుల కింద అరెస్ట్ చేశారు. శ్రీదేవిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress kamna jethmalani visited tirumala
Complaint filed against shah rukh khan for smoking  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles