Telangana agitations again day after tomarrow onwards kodandaram

telangana agitations again day after tomarrow onwards ..kodandaram

telangana agitations again day after tomarrow onwards ..kodandaram

9.gif

Posted: 04/08/2012 01:53 PM IST
Telangana agitations again day after tomarrow onwards kodandaram

             profkodandaramకొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ సెగ మళ్లీ రేగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉపఎన్నికలతో పాటు. సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో ఇక ఆందోళన దశల వారీగా ఉద్రుతం చేయాలని టీఆర్ఎస్ వర్గాల తోపాటు టీ.జేఏసీ కూడా భావిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమయాత్ర కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ రాజకీయ జెఏసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు.
              ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా, ఈనెల 10నుంచి 14వరకు తెలంగాణ ఉద్యమ యాత్ర కొనసాగుతుందని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ జిల్లానుంచి మండలాలు, గ్రామాల వరకూ జెఏసిలు ర్యాలీలు నిర్వహిస్తాయని కోదండరామ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాజకీయ జెఏసి సమావేశం అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 10న తెలంగాణ ఉద్యమ యాత్ర చర్లపల్లి నుంచి కాగడాయాత్ర ద్వారా ప్రారంభమవుతుందని,  11న తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, 12న సిద్ధిపేట, 13న నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉద్యమయాత్ర జరుగుతుందన్నారు.  14న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరతామని, కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
           తెలంగాణ పట్ల కాంగ్రెస్, టిడిపిల వైఖరి క్షమించరాని విధంగా తయారైందన్నారు. ప్రజలు ఈ రెండు పార్టీల దమననీతిని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో ఒకవైపు యువత నిరాశా నిస్పృహలకులోనై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోకపోవడం దారుణమని కోదండరామ్ దుయ్యబట్టారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chowdary interrogation in a full swing by police
Tollywood senior actor akkineni nageswara rao says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles