Azad tells andhra troika to be good boys

Azad tells Andhra troika to be good boys,Kiran-Botcha showdown likely in Delhi,Andhra Pradesh, Ghulam Nabi Azad, Congress, Bypolls,Andhra Pradesh,Hyderabad,India,Andhra Pradesh,AICC leaders, ACB, liquor scandal

Azad tells Andhra troika to be good boys

Azad.gif

Posted: 04/05/2012 01:21 PM IST
Azad tells andhra troika to be good boys

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బతికించుకునేందుకు విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో కలిసి కట్టుగా పని చేయని పక్షంలో తీవ్రపరిణామాలు తప్పవని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ , కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

నాయకులు కీచులాటలతో పార్టీకి నష్టం కలిగిస్తే సహించేది లేదని ఆజాద్ వారిని హెచ్చరించారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి వ్యవహార శైలిలో మార్పు రాకపోతే పద్దెనిమిది అసెంబ్లీ ఉపఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుందని ఆజాద్ ముగ్గురు నాయకులను హెచ్చరించినట్లు తెలిసింది. గులాం నబీ ఆజాద్ తన నివాసంలో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర్ రాజనరసింహతో నాలుగున్నర గంటల సేపుసుదీర్ఘ చర్చలు జరిపారు. సౌత్ ఎవెన్యూలోని ఆజాద్ అధికార నివాసంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి తొమ్మిది గంటల వరకూ కొనసాగాయి.

కిరణ్‌కుమార్ రెడ్డి ఆజాద్ నివాసానికి వచ్చి దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆయనతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఐదున్నర ప్రాంతంలో బొత్స సత్యనారాయణ, దామోదర్ రాజనరసింహ ఆజాద్ నివాసానికి వచ్చారు. మొదట విడి,విడిగా వచ్చిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి సమావేశం ముగిసిన అనంతరం ముగ్గురూ కలిసి ముఖ్యమంత్రి కారులో ఎపిభవన్‌కు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇరవై ఐదు నిమిషాల పాటు చర్చలు జరిపిన అనంతరం తమతమ నివాసాలకు వెళ్లిపోవటం గమనార్హం. ఆజాద్హితబోధ పని చేయటం వల్లనే విడిగా వచ్చిన ముగ్గురు ఒకే కారులో కలిసి వెళ్లటం ద్వారా సమైక్యతను ప్రదర్శించేందుకు ప్రయత్నించటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chow dary relation with officers
Supreme court says no to review of 2g licence cancellations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles