Village revenue assistant posts

VRA Post.gif

Posted: 03/29/2012 04:47 PM IST
Village revenue assistant posts

సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళితే ఆమె పేరు, ఊరుతో సహా అన్నీ అత్తవారింటిలో కలిసిపోతాయి. ఆమె అప్పటి నుండి తన భర్త ఇంటి పేరు, తన భర్త ఊరు పేరుతో పిలవబడుతుంది. కానీ ఇక్కడ అత్తవారింటికి వచ్చిన వారు ఎప్పటికీ పరాయి వారే అని అంటున్నారు భూ పరిపాలనా విభాగం అధికారుల నిబంధనలు.

మొన్న జరిగిన వీఆర్ఏ పరీక్షలో ప్రతిభ కనబర్చిన మహిళలకు తిరస్కరిస్తున్నారు. అత్తగారి గ్రామం సొంత గ్రామం కాదన్న కారణంతో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు 60 మందికి ఉద్యోగం ఇవ్వకుండా తిరకాసు పెడుతున్నారు. కానీ గతంలో అంగన్ వాడీ కార్యకర్తల నియామకంలో ఆ ఊరి కోడళ్ళకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకో విచిత్రమేమిటంటే... వివాహాం చేసుకొని వేరే ఊరిలో స్థిరపడ్డ మహిళలకు వారి సొంత గ్రామంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.  మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  National awards to sakshi tv
Classical music improves surgery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles