Sasikala wants to mend fences with jayalalitha

Sasikala wants to mend fences with Jayalalitha,jayalalitha Latest Breaking News, Pictures, Videos, and Special Reports, AIADMK, party supremo J Jayalalitha, VK Sasikala

Sasikala wants to mend fences with Jayalalitha

Jayalalitha.gif

Posted: 03/29/2012 10:24 AM IST
Sasikala wants to mend fences with jayalalitha

Sasikala wants to mend fences with Jayalalitha

తన ప్రియసఖి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చేరువకావడానికి శశికళ నటరాజన్ ప్రయత్నాలు ప్రారభించింది. దీని కోసం కుటుంబ సభ్యులను వదులుకుంటానని ఆమె ప్రకటించింది. పార్టీ, పదవికి ఎసరుపెడుతున్న విషయం గమనించిన అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత గత డిసెంబర్‌లో శశికళ, ఆమె బంధువర్గంపై వేటువేశారు. పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు శశికళ భర్త నటరాజన్‌పై పలు కేసులు పెట్టారు. అయితే జయలలితకు వ్యతిరేకంగా తన కుటుంబ సభ్యులు కుట్ర పన్నుతున్నట్టు తనకు తెలియదని శశికళ చెప్పారు. ఈ విషయం తెలిసిన తరువాత తాను షాక్‌కు గురయ్యాని ఆమె అన్నారు. అయితే తన ప్రియసఖి కోసం కుటుంబాన్ని వదులుకుంటానని శశికళ వెల్లడించింది. జయకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడిపే తన కుటుంబ సభ్యులతో తనకు పనిలేదని ఆమె తేల్చిచెప్పింది. శశికళ ప్రకటనను జయలలిత సారధ్యంలో నడుస్తున్న ‘జయ టివి’లోనే బ్రేకింగ్ న్యూస్‌గా ప్రసారం చేయడం గమనార్హం.

2011 డిసెంబర్లో శశికళ, ఆమె బంధువులపై అన్నాడిఎంకె అధినేత్రి జయలిలిత వేటు వేశారు. ఏకంగా పార్టీ ప్రధమిక సభ్యత్వం నుంచి వారిని బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల్లో ఉన్న బంధువర్గాన్ని తప్పించిన జయ తరువాత శశికళ భర్త నటరాజన్‌పై గురిపెట్టారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టించారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు పార్టీకి వ్యతిరేంగా పనిచేయడమే కాకుండా సిఎం పదవికి ఎసరుపెట్టిన విషయం జయ చెవినబడే అంత కఠిన చర్యలు తీసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా వాటిని ధృవీకరింలేదు. కాగా తన స్నేహితురాలికి వ్యతిరేకంగా కుట్ర జరిగిన విషయం తనకు తెలియనే తెలియదని శశిరేఖ నటరాజన్ స్పష్టం చేశారు. సంఘటన తెలిసి తాను షాక్‌కు గురైనట్టు ఆమె పేర్కొన్నారు. ఏది ఏమైనా జయకు చేరువకావడానికి తన కుటుంబాన్ని సైతం వదులుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆమె ప్రకటించారు. జయపై బెంగళూరు కోర్టులో నడుస్తున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ సైతం కోర్టుకు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri harikrishna angry again
Candidates for by election software engineer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles