Will balwant singh rajoana be hanged on saturday

Will Balwant Singh Rajoana be hanged on Saturday,assasination, Balwant Singh Rajoana, Beant Singh, Punjab government,Punjab, Beant Singh killing, Balwant Singh Rajoana, Punjab police, paramilitary forces

Will Balwant Singh Rajoana be hanged on Saturday

Balwant.gif

Posted: 03/28/2012 10:36 AM IST
Will balwant singh rajoana be hanged on saturday

Will Balwant Singh Rajoana be hanged on Saturday

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ను పొట్టన పెట్టుకున్న వారిలో సహహంతకుడు బలవంత్‌ సింగ్‌ రాజౌనాను ఉరితీయమని చండీగడ్‌ సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలవంత్‌సింగ్‌ను 31న ఉరితీయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమేకాక, కోర్టు ధిక్కార నోటీసులు కూడా పాటియాలా జైలు అధికారిపై జారీ అయ్యాయి. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో అధికారులు బలవంత్‌ ఉరికి సన్నాహాలు చేస్తుండగా, బలవంత్‌కు మద్దతుదారులు రెచ్చిపోయి విధ్వంసాలు చేయవచ్చనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించి భారీ భద్రత కల్పించారు. అయితే ఎడిషనల్‌ అడ్వకేట్‌ జెనెరల్‌ మాత్రం తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉరిశిక్ష ఆపుతామని అంటున్నారు.

ఒకరోజు బంద్‌కు రాడికల్ సిక్స్, దళ్ ఖల్సా, ఖల్సా యాక్షన్ కమిటీ వంటి వివిధ సంస్థలు పిలుపునిచ్చాయి. ఇదే సమయంలో బల్వంత్ సింగ్ తన సోదరి ద్వారా జైలు నుంచి ఓ లేఖను పంపారు. అందులో ఆయన తన ఉరి శిక్షను రద్దు చేయాలని ఎవరూ పోరాడాల్సిన అవసరం లేదన్నారు. అకాలీ దళ్ నేతలు మోసగాళ్లు అంటూ నిందించారు. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. లూధియానా, జలంధర్, మోగా తదితర పట్టణాల్లో భద్రతను పెంచింది. బల్వంత్‌సింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణిలో ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ఈ విషయంలో కేంద్రంగానీ, రాష్ట్రంగానీ ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. పంజాబ్‌కు చెందిన ఎన్‌జీవో సంస్థ జస్వంత్ సింగ్ ఉరిని రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desam party
High court has cancelled bp acharya bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles