రైతులకు వడ్డీలేని రుణాలిస్తేనే మేలు జరుగుతుందని రాష్ట్ర సీఎం కిరణ్కుమార్ అన్నారు. ఇవాళ జూబ్లీహాల్లో రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్సీలకు, బీసీలకు వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వారికి సూచించారు. రైతులకు బ్యాంకు రుణాల పంపిణీలో లోపాలు ఉన్నాయని సీఎం అన్నారు.
ప్రతి కౌలు రైతుకు రుణం మంజూరు చేయాలని, ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని సీఎం సూచించారు. లక్ష్యాల మేరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని మంత్రి ఆనం పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు రుణాలు పెంచాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయం త్వరితగతిన పొందేందుకు రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం ఈనెల 27న ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ను కలిసి రాష్ట్రంలో కరువు పరిస్థితులపై నివేదించనుంది. రాష్ట్రానికి తక్షణ సహాయంగా 3,774 కోట్లు అందించాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపించిన సంగతి తెలిసిందే.
రైతాంగాన్ని ఆదుకునేందుకు, సత్వరమే రుణాల రీషెడ్యూల్ చేయించేందుకు కరువు నిధుల విడుదలే కీలకం. ఈనేపథ్యంలో అటు ఇన్పుట్ సబ్సిడీ 1,880 కోట్ల రూపాయలు, రైతాంగాన్ని ఆదుకునేందుకు మరో 3వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని బృందం సభ్యులు ప్రధానమంత్రిని కోరనున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more