Sachin tendulkar on fire

SACHIN TENDULKAR ON FIRE,Sachin Tendulkar profile, cricket statistics, Sachin Tendulkar career records

SACHIN TENDULKAR ON FIRE

SACHIN.gif

Posted: 03/23/2012 06:28 PM IST
Sachin tendulkar on fire

SACHIN TENDULKAR ON FIRE

అంతర్జాతీయ క్రికెట్‌నుంచి ఇకనైనా తప్పుకోవాలంటూ తనకు సలహాలిస్తున్నవారిపై మాస్ట ర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నేనెప్పుడు తప్పుకోవాలో మీరెవరూ చెప్పాల్సిన పనిలేదు' అని సచిన్ బదులిచ్చాడు. 'క్రికెట్‌పై వ్యామోహం తగ్గింది' అనిపించిన రోజున తానే స్వ చ్ఛందంగా తప్పుకుంటానని పునరుద్ఘాటించాడు.

ఆట పై తనకున్న అపారమైన ప్రేమ కారణంగానే క్రికెట్‌లో కొనసాగుతున్నానని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం మినహా తనకు మరేదీ సంతోషాన్ని ఇవ్వలేదని తెలిపాడు. 'మైదానంలో సహచరులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపిస్తున్నప్పుడు నా శరీరం పులకించిపోతుం ది. బ్యాట్‌తో క్రీజులోకి వెళ్తున్నప్పుడు కూడా ఇదే రకమైన అనుభూతి కలుగుతుంద'ని సచిన్ అన్నాడు. ఆసి యా కప్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన సచిన్ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మాస్టర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అతని మాటల్లోనే.

ఒత్తిడికి లోనయ్యా..: వందో సెంచరీ అత్యంత క్లిష్టమైనదే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఈ సెంచరీ సాధనలో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యా. బహుశా అందరి దృష్టీ ఈ సెంచరీపైనే ఉండడమే దీని కి కారణం కావచ్చు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అనుకున్నాను.
ప్రపంచకప్ నా ఘనతకాదు : ప్రపంచకప్ నెగ్గిన అనంతరం నా మిత్రులు చాలామంది వన్డేల నుంచి తప్పుకోవచ్చుగదా అని సూచించారు. వారి ఆలోచన కరెక్ట్టే. అప్పుడు రిటైర్ అయితే గొప్పగానూ ఉంటుంది. అయితే ప్రపంచకప్ అనేది భారత్‌కు సంబంధించింది. దాన్ని నా ఘనతగా భావించే హక్కు నాకు లేదు. అసలిక్కడ నా రిటైర్మెంట్ అనేది సమస్యే కాదు. ప్రపంచకప్ నెగ్గిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే ఆ గొప్ప విజయం నుంచి దృష్టంతా పక్కకు మళ్లుతుంది. వాస్తవానికి ప్రపంచకప్ విజయంకన్నా నా రిటైర్మెంట్ ముఖ్యమేమీ కాదు. ఆ సమయంలో తప్పుకోవడం స్వా ర్థమే అవుతుంది. ఆటలోని మజాను ఆస్వాదిస్తున్నంతకాలం కొనసాగుతాను. నా రిటైర్మెంట్ గురించి మీ డియా కూడా అతిగా రాయాల్సిన పనిలేదు. ఎందుకం టే ఆ సమయం వచ్చినప్పుడు వారికి తప్పకుండా తెలియజేస్తాను.

నా కన్నా గొప్పవాళ్లున్నారు: ప్రపంచ క్రికెట్‌లో అందరికన్నా నేనే గొప్ప ఆటగాడిని అనడం సరైంది కాదు. నా కన్నా ముందు బ్రాడ్‌మన్, గారీ సోబర్స్ వంటి ది గ్గజాలు ఉన్నారు. నా సమకాలీనుల్లోనూ బ్రియాన్ లా రా, షేన్ వార్న్, రాహుల్ ద్రావిడ్, జాక్ కలిస్, రికీ పాంటింగ్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hanumantha rao
Raghuveera reddys silent deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles