Kiran under heavy fire over poll defeat

Kiran under heavy fire over poll defeat, Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy, ugadhi, festival, Telangana, Issue, Big scame, MlA shankara rao, bosta

Kiran under heavy fire over poll defeat

Kiran.gif

Posted: 03/23/2012 12:40 PM IST
Kiran under heavy fire over poll defeat

Kiran under heavy fire over poll defeat

నందన నామ సంవత్సర ఉగాది కిరణ్‌కు మరీ 'చేదు'గా మారనుందా? ఉప ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెసులో ముదురుతున్న గొడవలు చూస్తుంటే కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి ముళ్ల బాటలో ప్రయాణించక తప్పదనిపిస్తోంది. అధికార పార్టీలో విభేదాల ముదురుతున్నాయి. ఉప ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదే బాధ్యతంటూ నేతలు ఆయనపై దాడి ప్రారంభించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్‌ను తప్పించాలంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటమి బాధ్యత ముఖ్యమంత్రిది, పిసిసిది అంటూ అస్త్రాలు ఎక్కు పెట్టారు. అసెంబ్లీ లాబీల్లో పలువురు నేతలు ముఖ్యమంత్రికి అను కూలంగా, వ్యతిరేకంగా చీలిపోయారు. ముఖ్యమంత్రి వ్యతిరేక గ్రూపంతా ఆయనను రాజీనామా చేయాలని పట్టుబట్టగా, ఆయనను సమర్థించిన గ్రూపు మాత్రం అవసరం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు డీఎల్‌ రవీంద్రారెడ్డి సోనియాగాంధీకి లేఖ పంపించారు. సిఎంపై ఎప్పట్నుంచో కోపంగా ఉన్న డీఎల్‌ ఈ రకంగా తన కోపాన్ని తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఢిల్లీలో కిరణ్‌పై కె కేశవరావు మండిపడ్డారు. మరో పక్క అటవీ శాఖలో 500 కోట్ల ఎర్రచందనం అక్రమాలకు ముఖ్యమంత్రితో సహా ఆ శాఖ మంత్రిని సైతం పార్టీగా చేరుస్తూ హైకోర్టులో మాజీ మంత్రి శంకర్రావు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసి సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రి చెప్పినదానికి కట్టుబడతామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఫలితాల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandi awards presentation today
Coal scam involves three of your states  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles