Kancherla keshava rao

Kancherla Keshava Rao,congress party, Rajyashaba ticket, KK, Happy, Telangana state, Telangana Issue,

Kancherla Keshava Rao

Kancherla.gif

Posted: 03/20/2012 07:12 PM IST
Kancherla keshava rao

Kancherla Keshava Rao

తెలంగాణ సాధనలో పదవులు గడ్డిపోచతో సమానమన్న వ్యాఖ్యలకు సంతోషపడుతున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు స్పష్టం చేశారు. తనకు పదవి రాకపోవడానికి ఈ వ్యాఖ్యలే నిజ మైన కారణమై ఉండొచ్చు.. అయినా విలువలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ వాదిగానే ఉంటూ తెలంగాణపై పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. తనకు రాజ్యసభ సీటు రాకపోవడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణవాదం వినిపిస్తున్న పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్‌లను అధిష్టానం పెద్దల సభకు ఎంపిక చేయడంపై కేకే ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి చిరంజీవి, రేణుక ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడరాదని సూచిం చారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.రాష్ర్ట సాధన కోసం ఎవరితోనైనా కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనకు సీటు దక్కకపోవడం తెలంగాణ ఎంపీలకు హెచ్చరిక అవుతుందని భావించడం లేదన్నారు. 

రాజ్యసభ సీటు దక్కకపోవడంతో ఒకింత అసహనంగా ఉన్న కేకే ఇకపై ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి అధిష్టానంపై ఒత్తిడి పెంచేలా సన్నద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఉద్యమ బలోపేతానికి ఆయన టీఆర్‌ఎస్‌తో మరింత చనువుగా వ్యవహరించే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh by election vote counting poll results 2012
Rnarayana murthys ammakaniki andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles