రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యుర్ధులే విజయం సాధించనున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. డిసెంబర్, మార్చిలో తాను చేయించిన సర్వేలో ఇదే తేలిందని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సర్వే ఫలితాలు వెల్లడించారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్ధానాల్లోనూ రాజీనామా చేసిన అభ్యర్థుల్నే విజయం వరించనుందని చెప్పారు. టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గతంతో పోలిస్తే మోజారిటీ తగ్గనుండగా కాంగ్రెస్, టీడీపీకి ఓట్లు గణనీయంగా పెరగనున్నాయని పేర్కొన్నారు. గతంలో 65 శాతం ఓట్ల మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్..
ఈసారి కేవలం 25 శాతం మెజారిటీకే పరిమితంకానున్నట్లు సర్వేలో తేలిందని, దీన్నిబట్టి వారి ప్రభావం తగ్గుతుందన్న సంకేతాలు వెలువడ్డాయని సూత్రీకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తులో మెరుగైన ఫలితాలోస్తాయని జోస్యం చెప్పారు. ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించాల్సి ఉన్నా చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు వల్ల కోల్పోనుందని లగడపాటి తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ చెరి రెండు చోట్ల రెండో స్థానంలో ఉంటాయని, మిగిలిన మూడు చోట్ల రెండో స్థానానికి పోటీ నువ్వానేనా అన్నట్లు ఉందని చెప్పారు. ప్రభుత్వ పనితీరు బాగుందని మెజారిటీ ప్రజలు అభివూపాయపడ్డా ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయలేదని అన్నారు. ఓటింగ్ శాతం పెరిగిందన్న సంతోషం ఉన్నా ప్రభుత్వ అనుకూల ఓట్లను పొందలేకపోయామన్న బాధ కూడా ఉందని చెప్పారు. అసత్య ప్రచారాన్ని, ఆరోపణల్ని తిప్పికొట్టడంలో నేతలు, కార్యకర్తలు విఫలమయ్యారని పేర్కొన్నారు.
వివిధ అంశాల పట్ల అధిష్ఠానం నుంచి క్షేత్రస్థాయి వరకు స్పష్టతలేకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొందని, అది అంతిమంగా కాంగ్రెస్ ఓటమికి దారితీయనుందని తెలిపారు. ఎవ్వరిపైనా సానుభూతి/మెతక వైఖరి ప్రదర్శించొద్దని అధిష్ఠానానికి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు తమకు గుణపాఠం నేర్పనున్నాయని, భవిష్యత్తులో తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం చెప్పాల్సింది ఇప్పటికే చెప్పేసిందని, అధికారిక ప్రకటన తప్ప అన్నీ అయిపోయాయని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more