Union budget 2012 13 summary

Union Budget 2012-13 Summary,Budget 2012, Union Budget, Budget Summary,Union Budget 2012,Union Budget,pranab mukherjee budget speech,Finance minister,Budget 2012-13,budget 2012

Union Budget 2012-13 Summary

Union Budget.gif

Posted: 03/16/2012 03:20 PM IST
Union budget 2012 13 summary

Union Budget 2012-13 Summary

కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2012-13 బడ్జెట్‌ను లోకసభలో ప్రవేశ పెట్టారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం ఆయన సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ప్రణబ్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు...

కేంద్ర బడ్జెట్ ముఖ్యంశాలు

• 2012-13 బడ్జెట్ అంచనాలు
• ప్రణాళికా వ్యయం రూ. 5,21,025
• ప్రణాళికేతర వ్యయం రూ. 9,69,900
• పన్ను వసూళ్లలో రూ. 32 వేల కోట్ల తగ్గుదల
• ద్రవ్యలోటు 5.9 శాతం
• 2012-13కి మొత్తం ద్రవ్యంలోటు రూ. 1,85752 కోట్లుగా అంచనా
• జీడీపీలో 45 శాతంగా కేంద్ర రుణభారం

కేటాయింపులు

• రైతులకు స్వల్పకాలిక రుణాలకై నాబార్డు ద్వార రూ. 10వేల కోట్లు
• హైదరాబాద్ ఎంజీ రంగా, కేరళా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు రూ. 200 కోట్లు
• చిన్న, మద్యతరహా పరిశ్రమల కోసం రూ. 5వేల కోట్ల నిధి
• సర్వశిక్షా అభినాయ్ కు రూ. 25,555 కోట్లు
• గ్రామీణ మౌలిక వసతుల అభివృద్దికి రూ. 20వేల కోట్లు
• వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి రూ. 12,040 కోట్లు
• ప్రధానమంత్రి సడక్ యోజనాకు రూ. 24 వేల కోట్లు
• వ్యవసాయ రుణ లక్షం రూ. 5.75 లక్షల కోట్లు కేటాయింపు
• గ్రామీణ మహిళలకు 7 శాతం వడ్డితో రూ.3లక్షల వరకు రుణాలు
• వితంతు పింఛంన్లు రూ. 200 నుంచి రూ. 300 కు పెంపు
• కుటుంభ లబ్ది పథకం కింద రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంపు
• 2011 -12లో వృద్ది రేటు 6.9 శాతం
• 2012-13లో వృద్ది రేటు 7.6 శాతం ఉంటుందని అంచనా
• వృద్దిరేటు తగ్గదల తీవ్ర ప్రభావం చూపుతుంది. 2011-12లో జీడీపీ వృద్దిరేటు చాల నిరుత్సాహకంగా ఉంది
• ఎగుమతులకు కొత్త మార్కెట్ల అన్వేషణ ఫలించడంతో సంక్షొభం నుంచి కాపాడింది
• తొలి త్రైమాసికంలో 23 శాతం పెరిగిన ఎగుమతులు
• ఆసియాదేశాలకు ఎగుమతులు 33.3 శాతం నుంచి 57 శాతానికి పెరుగుదల
• ముడి చమురు ధర 2011-12లో పెరగడం వల్ల తీవ్ర ప్రభావం చూపింది
• ముడి చమురు కొనుగోళ్లకు గణనీయంగా నిధుల వ్యయం
ముడి చమురు పెరుగుదలపై ప్రపంచ పరిస్థితుల ప్రభావం, యూరప్ సంక్షోభం, మధ్య ప్రాచ్య రాజకీయ ప్రభావం

• వ్యవసాయం సేవా రంగాలు మెరుగ్గా ఉన్నాయి, తయారీ రంగం పురోగమణం సాధిస్తుంది.
• వ్యవసాయ అనుబంద రంగం 2.5శాతం వృద్ది సాధించే అవకాశం
• దేశీయ అవసరాలు తీర్చేందుకు ప్రైవేటు భాగస్వామ్యంపై దృష్టి
• ప్రజాజీవితంలో అవినీతి, నల్లధనం లేకుండా చేయాలి
• సంస్కరణలు వేగవంతం చేయవలసిన అవసరం ఉంది
• 2011లో ద్రవ్యోల్భణం సమస్య అధికంగా ఉంది
• రానున్న కాలంలో ద్రవ్యోల్భణ దిగివచ్చే అవకాశం
• ఆహార ద్రవ్యోల్భణం నియంత్రణలో రాష్ట్రల సహాకారం గణనీయం
• నిరుత్సాహకరంగా పారిశ్రామిక ప్రగతి
• పారిశ్రామికాభివృద్ది తగ్గడం వల్ల వృద్ది రేటు మందగించింది
• ఆర్థిక పునర్జీవనానికి ఐదు సూత్రాల ప్రణాళిక అమలు
• లబ్ధిదారులకు నేరుగా సబ్సీడీ అందించే ప్రక్రియ వేగవంతం చేస్తాం
• నిలేకనీ కమిటీ పేర్కోన్నట్లు లబ్ధిదారులకే సబ్సీడి అదేలా చేస్తాం, కమిటి సిపారసులు అమలు చేస్తాం
• గ్యాస్ ఫైలెట్ ప్రాజెక్టు మైసురులో నడుస్తుంది
• రానున్న ఐదేళ్లలో ఆహార భద్రతాబిల్లు పూర్తి స్థాయిలో అమలు
• ఎరువుల సబ్సిడీ రాయితీల చెల్లిపునకు కంప్యూటరీకరణతో కూడిన వ్యవస్థ
• వచ్చే ఆరు నెలల్లో 50 జిల్లాల్లో ఫైలట్ పథకం
• ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
• త్వరలో ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లు
• రిటైల్ రంగంలో విదేశి పెట్టుబడులకు ప్రయత్నాలు కొనసాగుతాయి
• ఇకనుంచి ఐపీవో ప్రక్రియ సరళతరం
• నాబార్డు, ఇతర వ్యవసాయ బ్యాంకులకు రూ. 15,888 కోట్లు
• బడ్జెట్లో భాగంగానే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సవరణలు
• రాబోయే మూడేళ్లలో జీడీపీలో 1.7 శాతానికి సబ్సిడీలు పరిమితం
• సబ్సిడీ లబ్ధిదారులకే అందేలా నిలేకని కమిటీ సిఫారసులను అమలు చేస్తాం

ఆదాయపు పన్ను 

• ఆదాయపు పన్ను మినహాయింపు రూ.2 లక్షలకు పెంపు
• రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయపు పన్ను 10 శాతం
• రూ. 5లక్షల నుంచి రూ 10 లక్షల వరకు ఆదాయపు పనున్న 20 శాతం
• రూ. 10 లక్షలు పైబడి ఆదాయం ఉంటే 30 శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది
• ఎస్‌బీ ఖాతాలో 10వేలు మదుపుపై పన్నుకు మినహాయింపు
• స్త్రీలు, వృద్దులకున్న గరిష్ఠ మినహాయింపు పరిమితి రూ. 2 లక్షలే
• పరిశ్రమలకు పన్ను మినహాయిపు కోసం టర్నోవర్ పరిమితి కోటికి పెంపు
• రూ. 2లక్షలపైన బంగారు కొనుగోళ్లపై తక్షణ టీడీఎస్
• ప్రత్యక్ష పన్నుల్లో గతేడాది 4 వేల కోట్ల లోటు
• కార్పోరేట్ పన్నుల్లో ఎలాంటి మార్పులు లేవు
• సినీరంగానికి సేవా పన్ను మినహాయింపు
• సినిమాటోగ్రఫీ కాఫీ రైట్‌కు సేవా పన్ను నుంచి మినహాయింపు
• సేవా పన్ను నుంచి 17 సేవలకు మినహాయింపు, విద్యా, ప్రభుత్వసేవలు, వినోదం, ప్రజారవాణాకు మినహాయింపు
• సర్వీస్‌ట్యాక్స్, సెంట్రల్ ఎకై్సజ్‌లకు కామన్‌కోడ్ ప్రతిపాదన
• లగ్జరీ కార్ల దిగుమతిపై పన్ను 22 నుంచి 24 శాతానికి పెంపు
• వ్యవసాయేతర వస్తువుల దిగుమతిపై కస్టమ్స్ సుంకంలో మార్పు లేదు
• విమానాల అధునికీకరణకై విడిభాగాలపై దిగుమతి సుంకం మినహాయింపు
• ఈ సమావేశాల్లోనే మైక్రో ఫైనాన్స్ సంస్థల నియంత్రణ బిల్లు
• గుంటురు ప్రకాశం జిల్లాల్లో చేనేత సముదాయాలు ఏర్పాటు చేస్తాం, కార్మికుల కోసం డార్మెటరీలు ఏర్పాటు
• ఆశా వర్కర్లకు ప్రతిభ ఆదారంగా వేతనాలు పెంపు
• యువతకు ఉద్యోగాల కోసం రూ.1276 కోట్లతో ప్రధాని ఉపాధి పథకం
• బలహీన వర్గాలకు రూ. 8400 కోట్లు
• రక్షణ సర్వీసులకు రూ.1,93,407 కోట్లు
• నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు రూ. 1000 కోట్లు
• మధ్యహ్న భోజనానికి రూ. 11,930 కోట్లు
• ఆనంద్ రూరల్ మేనేజ్‌మెంట్ సంస్థకు రూ. 25 వేల కోట్లు
• ఈ సమావేశాల్లోనే జాతీయ హౌసింగ్ బ్యాంక్ నియంత్రణ బిల్లు
• చిన్న, మద్యతరహా పరిశ్రమల కోసం రూ. 5వేల కోట్ల నిధి
• రైతులకు వడ్డి రాయితీ కొనసాగింపు
• కిసాన్ క్రెడిట్ కార్డు పథకం సవరణ
• కిసాన్ క్రెడిట్ కార్డును ఏటీఏం కార్డులా వినియోగించే స్మార్ట్‌కార్డులు జారీ
• సకాలంలో రుణాలు చెల్లించే మహిళా సంఘాలకు 4 శాతం వడ్డీ
• మాతా శిశు సంక్షేమ పథకానికి రూ. 15,850 కోట్లు
• నల్లధనంపై శ్వేతపత్రం ఈ సమావేశంలోనే ప్రవేశపెడతాం
• గ్రామీణ తాగునీటి, పారిశుద్ధ అవసరాలకు 14 వేల కోట్లు
• రూ. 3,884 కోట్ల చేనేత రుణాలు మాఫీ
• సేవా పన్ను నుంచి ఆశిస్తున్న ఆదాయం రూ.18650 కోట్లు
• కస్టమ్స్, ఎకై్సజ్ సుంకాల పెంపు ద్వారా రూ. 27,280 కోట్ల ఆదాయం
• సౌరవిద్యుత్ పరికరాల దిగుమతిపై కౌంటర్ వీలింగ్ సుంకం రద్దు
• బంగారు దిగుమతులపై సుంకం 5 శాతం పెంపు
• ప్లాటినం దిగుమతులపై సుంకం 10 శాతం పెంపు
• విమానయాన రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐల ప్రతిపాదన పరిశీలనలో ఉంది
• విమాన విడిబాగాలు, టైర్లు, పరీక్షా పరికరాల దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయింపు
• సైకిళ్లపై 30 శాతం కస్టమ్స్ సుంకం పెంపు
• కార్లపై 27 శాతం విలువ ఆధారిత పన్ను
• అన్ని విదేశికార్లు, ఎస్‌యూవిలపై దిగుమతి సుంకం పెంపు
• ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు, ధరలు తగ్గే అవకాశం
• సీఎఫ్‌ఎల్‌లు, అగ్గిపెట్టెలు, సోయా ఉత్పత్తులు, ఉప్పు ధరలు తగ్గే అవకాశం
• సిగరెట్లు, కాస్మోటిక్స్ ధరలు మరిత పెరిగే అవకాశం
• ప్రాసెస్ట్ ఫుడ్‌పై ఎకై్సజ్ సుంకం 6శాతం తగ్గింపు
• థర్మల్ విద్యుత్ సంస్థలకు రెండేళ్లవరకు ఎకై్సజ్ పన్ను మినహాయింపు
• రహదారి నిర్మాణ ప్రాజెక్టుల యంత్ర భాగాల దిగుమతులపై పూర్తి పన్ను మినహాయింపు. వాటి నిర్మాణానికి ఉపయోగించే సామాగ్రిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు
• రహదారుల అభివృద్ది ప్రాజెక్టు కింద 8800 కి.మీ. రోడ్లు అభివృద్ది చేస్తాం
• ఎరువుల పరిశ్రమ ఉత్పాదక సామగ్రిపై దిగుమతి సుంకం మూడేళ్లపాటు మినహాయింపు
• సహజవాయువు, ఎల్‌ఎన్‌జీ, విద్యుదుత్పత్తికి వినియోగించే యురేనియంపై రెండేళ్ల పాటు కస్టమ్స్ సుంకం మినహాయింపు
• టన్ను దేశియ ముడిచమురుపై రూ. 2,500 నుంచి రూ. 4,500కు సెస్ పెంపు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acharya released on bail
Dating yeah i m 23 i m human virat kholi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles