Rahul dravids superstitions and his moment of anger

Rahul Dravid's superstitions and his moment of anger,Rahul Dravid,Dravid's retirement, Vijeeta Dravid, dressing room,

Rahul Dravid's superstitions and his moment of anger

Rahul.gif

Posted: 03/13/2012 05:09 PM IST
Rahul dravids superstitions and his moment of anger

Reactions to Rahul Dravid

రాహుల్ తో వివాహమై దాదాపు తొమ్మిదేళ్లు కావస్తోన్నా మాకు తెలిసిన ప్రపంచం ఇల్లు.. పిల్లలు అంతే. నేనతని భార్యను. అభిమానిని కాదు. పెళ్లవగానే 2003 మేలో రాహుల్ నాతో అన్న మాటలు నాకిప్పటికీ గుర్తే. మరో మూడు నాలుగేళ్లు క్రికెట్ ఆడగలనని , ఆ సమయంలో నా సంపూర్ణ సహకారం కావాలని చెప్పాడు. కానీ అనుకున్నదాని కంటే ఎక్కువగానే ద్రవిడ్ ప్రయాణించాడు. అతను పవిత్రంగా చూసుకునే క్రికెట్ బ్యాగును మాత్రం ముట్టుకునేదాన్నే కాదు. ఆ బ్యాగును పూర్తిగా తనే సర్ధుకునేవాడు. రాహుల్ కు నిశ్శబ్దం కావాలి. అందుకోసం విడిదిలో రెండు గదులు తీసుకుంటాడు. ఇతర ఆటగాళ్లలాగే రాహుల్ కు కొన్ని నమ్మకాలున్నాయి. కొత్త బ్యాట్ ను సిరీస్ మొత్తం వాడడు. ముందుగా కుడివైపు తొడ ప్యాడ్ కడతాడు. క్రమశిక్షణతో వ్యవహరిస్తాడు. పనివారిపై ఎక్కువగా ఆదారపడడు.

భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. ఎప్పుడూ కూల్ గా, నిశ్చలంగా ఉండే మిస్టర్ డిపెండబుల్ కోపం తో కుర్చీని విసిరేశాడంటే నమ్ముతారా! కష్టమే.. అయినా ఇది నిజం. ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలవడంతో సహనాన్ని కోల్పోయిన ద్రా విడ్ డ్రెస్సింగ్ రూమ్‌లో కుర్చీని విసిరేశాడట! ఈ విషయాన్ని ద్రావిడ్ భార్య విజేత తెలిపింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 'వాల్'కు కోపమొచ్చిన సందర్భాన్ని విజేత గుర్తుచేసింది.

'ఇది ఒకేసారి జరిగినట్టు నాకు గుర్తు. ఓ టెస్టు మ్యాచ్ అనంతరం 'నాకీ రోజు కోపమొచ్చింది. దీంతో సహనాన్ని కోల్పోయాను. నేనలా చేసి ఉండాల్సింది కాదు' అని నాతో చెప్పాడు. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత సెహ్వాగ్ అసలు విషయాన్ని చెప్పాడు. ముంబయిలో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం ద్రావిడ్ కుర్చీ విసిరేశాడని, మ్యాచ్ పోయినందుకు కాదు.. మరీ చెత్తగా ఓడినందుకు అతడికి అంత కోపమొచ్చిందని వీరూ నాకు తెలిపాడ'ని విజేత పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srenu talking after 13 years
New punjab assembly a crorepati club  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles