Ias officer dies trying to stop illegal mining

IAS officer dies trying to stop illegal mining,Narendra Kumar Singh,mining mafia,Keshav Dev,ips officer,crushed to death

IAS officer dies trying to stop illegal mining

IAS.gif

Posted: 03/09/2012 11:20 AM IST
Ias officer dies trying to stop illegal mining

IAS officer dies trying to stop illegal mining

అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ఐపిఎస్ అధికారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరీనా జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మొరీనా జిల్లా బామోర్ పోలీసు సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా ఇటీవలే నియమితుడైన నరేంద్ర కుమార్ అక్కడి ఒక రాళ్ల క్వారీలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం అందండంతో క్వారీ వద్దకు వెళ్లారు. మైనింగ్ చేసిన రాయితో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆపడానికి నరేంద్ర కుమార్ ప్రయత్నించగా, డ్రైవర్ పైశాచికంగా ఆయనను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ విషయం తెలియగానే రాష్ట్ర హోం మంత్రి ఉమా శంకర్ గుప్తా, సీనియర్ పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. దోషులపై కఠిన చర్య తీసుకుంటామని చెప్పిన ఆయన అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై దాడులను ప్రభుత్వం కొనసాగిస్తుందని కూడా తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పిన ఆయన రాళ్ల క్వారీలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారినందరినీ అరెస్టు చేయడానికి వారి కోసం వేట మొదలుపెట్టినట్లు చెప్పారు. కుమార్ భార్య మధ్యప్రదేశ్‌లోనే ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ప్రసూతి సెలవుపై ఆమె ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాఅలను ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తాయని, అయితే బిజెపి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మౌనం వహించిందని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన మరోసారి డిమాండ్ చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri rama navami utsavam at bhadrachalam sita ramachandra
Yeddyurappa queers the pitch to get top post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles