Tata motors to come up with 100kmltr mileage car read more at httpindiatodayintodayinstorytata motors 100 km per litre car megapixel

tata, tata motors, 100kmpl car, 100 km per litre, 100 km/ltr mileage, tata nano, tata megapixel

Tata Motors is aiming to make a car, Tata Megapixel, that would deliver an average of 100 km per litre

Tata Motor Megapixel-car.gif

Posted: 03/07/2012 06:49 PM IST
Tata motors to come up with 100kmltr mileage car read more at httpindiatodayintodayinstorytata motors 100 km per litre car megapixel

Megapixel-carప్రపంచంలోనే అత్యంత చౌక కారు నానోతో అదరగొట్టిన టాటా మోటార్స్ మరో అద్భుతానికి నాంది పలికింది. ఈసారి ఏకంగా మైలేజీలో సంచలనం సృష్టించే మెగా పిక్సెల్ కారును ఆవిష్కరించింది. ఈ కారు లీటర్‌కు ఇచ్చే మైలేజీ అక్షరాలా 100 కిలోమీటర్లు.. హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేసే ఈ కారులో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ బ్యాటరీలు కూడా ఉంటాయి. నగర ప్రయాణానికి అనువుగా ఉండేలా డిజైన్ చేసిన మెగాపిక్సెల్‌ను జెనీవా మోటార్ షోలో రతన్ టాటా ఆవిష్కరించారు.

టాటా మోటార్స్ సొంతంగా రూపొందించిన టెక్నాలజీతో తయారైన అద్భుతమైన ఈ కారు మూడేళ్లలో రోడ్డెక్కనుంది.ఈ కారును సృష్టించడానికి సమాంతరంగా పలు టెక్నాలజీలను రూపొందించాల్సిన అవసరం ఉందని, అందుకే తయారీకి మూడేళ్లు అవసరమని టాటా అభిప్రాయపడ్డారు. భారత్, బ్రిటన్, ఇటలీలోని డిజైన్ సెంటర్లు మెగాపిక్సెల్ తయారీలో పాలు పంచుకున్నాయని, మెగా సిటీల్లో నడపడానికి అనువుగా ఉండాలన్న లక్ష్యంతోనే దీనిని డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు.

కాగా మెగా పిక్సెల్ కారు తయారీలో అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించారు. ఈ కారులో పెట్రోల్ ఇంజన్‌తోపాటు లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వ్యవస్థ కూడా ఉంటుంది.పెట్రోల్ ఇంజన్‌తో కారు నడిచేటప్పుడే ఈ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. ఒకసారి ఈ కారు ట్యాంక్‌ను నింపితే 900 కిలోమీటర్ల వరకూ ఆగకుండా వెళ్లవచ్చు. బ్యాటరీల శక్తిని కూడా కలుపుకుంటే ఈ కారు లీటర్‌కు 100 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అంతేకాదు ఈ కారు పర్యావరణానికి అనుకూలమైనది. ప్రతీ కిలోమీటర్ ప్రయాణంలో కేవలం 22 గ్రాముల కర్బన ఉద్గారాలను మాత్రమే విడుదల చేస్తుంది. మెగా పిక్సెల్ కారు ఎలక్ట్రికల్ శక్తితో నడవడానికి ప్రతీ చక్రానికి ఒక్కొక్క ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్లకు కారు చక్రాలను వ్యతిరేక మార్గంలో తిప్పగలిగే శక్తి కూడా ఉంది. అందువల్ల ఈ కారును పార్క్ చేయడం కూడా ఎంతో సులభం. ఈ కారును ఇండెక్షన్ ప్యాడ్‌పైన పార్క్ చేస్తే చాలు.. ఆటోమేటిగ్గా ఛార్జ్ అవుతుంది. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందించే ఈ కారు పెట్రోల్‌పై భారీగా ఖర్చు పెట్టలేని సామాన్యులకు వరంగా పేర్కొనవచ్చు. గత ఏడాది జెనీవా మోటార్ షోలో పిక్సెల్ కారును ఆవిష్కరించిన టాటా మోటార్స్ తాజాగా మెగా పిక్సెల్‌ను విడుదల చేసింది. అయితే.. పిక్సెల్ ఇంకా రోడ్డెక్కలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl ravindra reddy sensational comments
Young turks akhileshsukhbir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles