Tak 875 fights diabetes as well

business, companies, economy, headlines, industry, politics, world

Takeda’s TAK-875 Fights Diabetes as Well as Older Drug in Study.

TAK-875 Fights Diabetes as Well.gif

Posted: 02/28/2012 01:18 PM IST
Tak 875 fights diabetes as well

diabetesమధుమేహం పై ఇప్పటికీ ఎనో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఔషదాలు వచ్చాయి. కానీ వాటిలో ఏది అంత సమర్థవంతంగా పనిచేయలేదని తేలింది. అయితే తాజాగా మధుమేహాన్ని సమర్థంగా నియంత్రించే సరికొత్త ఔషధం సిద్ధమైంది. ఇప్పటికే ఒక దశ పరీక్షలు పూర్తి చేసుకున్న 'టీఏకే-875' అనే ఈ మందు.. రెండో దశలోనూ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ప్రస్తుతం టైప్ 2 మధుమేహం చికిత్సకు ఉపయోగిస్తున్న 'సల్ఫోనైల్యూరీ గ్లిమిపిరిడ్' కంటే.. ఈ 'టీఏకే-875' మరింత మెరుగ్గా పనిచేస్తుందని మిచిగన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పైగా దీని వల్ల దుష్రబావాలు కూడా చాలా తక్కువని, రక్తంలో చక్కెర స్థాయిలను అతి తక్కువగా, అతి ఎక్కువగా ఉండకుండా సాధారణ స్థాయిలో ఉంచుతుందని పేర్కొంటున్నారు. "ఈ 'టీఏకే-875' ఔషధాన్ని 426 మంది మధుమేహ బాధితులపై ప్రయోగాత్మకంగా పరిశీలించాం. ఫలితాలను చూసి మేమే ఆశ్చర్యపోయాం. టైప్-2 మధుమేహానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటి కంటే ఈ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇక తుది పరీక్షలను చేయాల్సివుంది. త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి రాగలదని భావిస్తున్నాం'' అని శాస్త్రవేత్తలు తెలిపారు. సో... త్వరలో మధుమేహం టైప్-2 బాధితుల కష్టాలు తీరిపోనున్నాయన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Father leaves children in train
Party promotion is main aspect in assembly discussions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles