Ka paul launches praja shanti party

KA Paul, Praja Shanti Party, 2008 new political parties, 2008 politics

KA Paul launches Praja Shanti Party - Equality among all castes are the priorities of new party Andhra Pradesh State News Updates

KA Paul launches Praja Shanti Party.gif

Posted: 02/27/2012 07:48 PM IST
Ka paul launches praja shanti party

KA-Paul-launches-Praja-Shanప్రముఖ ప్రపంచ క్రైస్తవ మత ప్రచారకుడు కె.ఎ. పాల్ మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గతంలోనే నుండే రాజకీయాల్లో ఉన్నా అతడు గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా అతను మళ్ళీ రాజకీయ పున:ప్రవేశం చేయడమే కాకుండా మళ్ళీ ప్రజాశాంతి పార్టీని పునరుద్దరించాడు. గతంలో ఆయన ఇదే పేరుతో కొన్ని రోజులు పార్టీని నడిపించాడు. ఏమైందో ఏమో కానీ కొన్ని రోజులు రాజకీయాలకే దూరంగా ఉన్నాడు.తాజాగా మళ్ళీ అదే పార్టీని ఆవిర్భవించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని, నాయకులు స్వార్థ ప్రయోజనాలు కోసం పేద వర్గాల వారిని పీడించుకుతింటున్నారని పేదలు మరింత హీన స్థితికి దిగజారి పోతున్నారని అందుకోసమే ఈ పార్టీని మళ్ళీ ప్రారంభించినట్లు తెలిపారు.సమాజంలో మార్పు కోసం , అవినీతి లేని సమాజం కోసం , అందరు అధికార నినాదంతో రాష్ట్రాన్ని సౌభాగ్యాంధ్ర ప్రదేశ్ తీర్చిదిద్దడానికి తన పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు.  ఏ నిరుపేద, బడుగు బలహీన మైనారిటీ వర్గాల ఉన్నతి కోసం తాను చేస్తున్న కార్యక్రమాలను రాజకీయ అధికారంతో అడ్డుకున్నారో అదే రాజకీయ అధికారం సాధించి తన లక్ష్యం నెరవేరుస్తానన్నారు. 2014 ఎన్నికల్లో అన్నీ అసెంబ్లీ స్థానాల్లో తన పార్టీ పోటీచేస్తుందని కూడా ఆయన చెప్పారు. త్వరలో జరగబోయే రామచంద్రపురం ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ఆయన తెలిపారు.

మరి కే.ఏ. పాల్ గతంలో కాంగ్రెస్ కి దగ్గరవుతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. మొన్నటికి మొన్న హైదరాబద్ లోని  తన సంస్థ  గ్లోబల్ పీస్ మిషన్ లో ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి కపిల్ సిబల్ ని కూడా ఆహ్వానించాడు. దీంతో అందరు పాల్ కాంగ్రెస్ లో చేరుతాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పాల్ రాజకీయపార్టీ పెట్టడంతో అనేక సందేహాలు నెలకొన్నాయి.జగన్ ని రాజకీయంగా దెబ్బకొట్టడానికే  గ్రెస్ పార్టే పాల్ తో మళ్ళీ పార్టీ పెట్టించిందని, వారి బలంతోనే పాల్ ఉప ఎన్నికల్లో పోటీకి సిధ్దం అయ్యాడని కూడా అంటున్నారు,. మరి కాంగ్రెస్, పాల్ పార్టీలు కలిసి జగన్ ని ఏ మేరకు కంట్రోల్ చేస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Antony visit to arunachal objected by china
Jp sold rice in maharashtra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles