Now a gel to repair tissue damaged by heart attacks

Now, a gel to repair tissue damaged by heart attacks,Heart repair gel, Heart tissues, heart attacks, Myocardial infarction

Now, a gel to repair tissue damaged by heart attacks

gel.gif

Posted: 02/23/2012 01:43 PM IST
Now a gel to repair tissue damaged by heart attacks

Now, a gel to repair tissue damaged by heart attacks!గుండెపోటు కారణంగా కణజాలం దెబ్బతిని బలహీనమయ్యే గుండెను ఇకపై కేవలం ఒక ఇంజెక్షన్‌తోనే బలోపేతం చేయవచ్చు. గుండె సంబంధిత కణజాలం నుంచి తయారుచేసిన హైడ్రోజెల్ (జిగురులాంటి పదార్థం)ను దెబ్బతిన్న గుండె భాగంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఒక్క అమెరికాలోనే ఏటా 7.85 లక్షల గుండెపోటు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాము సాధించిన ఈ విజయం స్వాగతించదగ్గ పరిణామమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధన బృందం సారథి కరెన్ క్రిస్ట్‌మాన్ పేర్కొన్నారు.

గుండె కణజాలానికి ఎలాంటి నష్టం కలిగించకుండానే, దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాల పునరుత్పత్తికి ఈ జెల్ దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ జెల్‌ను గుండెలోకి సులభంగా ప్రవేశపెట్టవచ్చని, ఎలాంటి ఆపరేషన్ గానీ, మత్తుమందుగానీ అవసరం ఉండదన్నారు. గుండె దెబ్బతిన్న పందుల్లో చికిత్సకోసం దీనిని వినియోగించగా మంచి ఫలితాలు వచ్చాయని, వచ్చే ఏడాది నుంచి దీనిని మనుషుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు ఆయన ఈ మేరకు ‘జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’లో పేర్కొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  French village for sale
Miracle fruit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles