Pg college

PG College

PG College

PG College1.gif

Posted: 02/20/2012 03:15 PM IST
Pg college

అది.. రంగారెడ్డిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల. విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధన ఫీజులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించే కార్యక్రమంలో భాగంగా ఒక మహిళా అధికారి ఆ కాలేజీకి వద్దకు వచ్చారు. అక్కడ కాలేజీ అయితే ఉందిగానీ... దాని పేరు మాత్రం ఆ అధికారి చేతుల్లో ఉన్న దరఖాస్తులో పేర్కొన్న కాలేజీ కాదు!! అది వేరే ప్రముఖ కాలేజీ. తప్పు చిరునామాకు వచ్చానేమోనని ఆమె మరోసారి సరిచూసుకున్నారు. అడ్రస్ అదే! అంటే ఆమె వచ్చింది సరైన చోటుకే..! ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని ఆవిడకు అనుమానం వచ్చి మరోసారి పరిశీలన చేయగా... అసలు గుట్టు బయటపడింది!! 

ఆ దరఖాస్తులో ఉన్నది ఓ బోగస్ కాలేజీ! కాగితాల్లో మాత్రమే మనుగడ సాగిస్తున్న దొంగ కాలేజీ. 2011-12 సంవత్సరానికిగాను ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు సమర్పించినట్టుగా 390 దరఖాస్తులు వచ్చాయి. ఆ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారి రావడంతో అసలు విషయం బయటపడింది. ఇంకా దిగ్భ్రాంతి కలిగించే నిజమేంటంటే... ఈ ఏడాదే కాదు, గత కొన్నేళ్లుగా ఆ 'దొంగ కాలేజీ' ఇదే తరహాలో దోపిడీ చేస్తోంది.

ఏటా ఆ కాలేజీ పేరిట ఫీజులు కూడా మంజూరయిపోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆ మహిళా అధికారి కాలేజీ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయగా వారు నీళ్లు నమిలారు. సదరు అధికారికి 'నచ్చజెప్పే' ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఈ వ్యవహారం గురించి.. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన నేరుగా రంగారెడ్డి జిల్లాకు వెళ్లి తనిఖీ నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swedish man trapped in car for two months
Veerasivareddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles