Beni prasad says sorry slip of tongue

beni prasad says sorry slip of tongue, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

beni prasad says sorry slip of tongue, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

beni-prasad-1-3.gif

Posted: 02/18/2012 05:40 PM IST
Beni prasad says sorry slip of tongue

beni-prasadచెప్పదలచుకున్నదంతా చెప్పి, ఆ తర్వాత నోరుజారిందని ఒప్పుకుంటే సరి. మొన్నటికి మొన్న న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖురేషీ రిజర్వేషన్ గురించి తాను చెయ్యదలచుకున్న ప్రకటనలను చేసేసి, అందులో భాగంగా ఇసి ఉరితీసినా సరే నంటూ సవాల్ చేసి తీరా ఇసి దాన్ని సీరియస్ గా తీసుకునే సరికి తప్పైపోయిందని తలవంచి మరీ చెప్పారు. ఈ సారి తాజాగా కేంద్ర ఉక్కు మంత్రి బేణీ ప్రసాద్ మరోసారి అదే తప్పు చేస్తూ, ప్రచారంలో భాగంగా, ముస్లిం రిజర్వేషన్ విషయాన్ని లేవనెత్తి, కావలిస్తే ఇసిని తనకీ నోటీసొకటి ఇవ్వమనండి అంటూ సవాల్ చేసారు.

దాని మీద ఈసారి ప్రతిపక్షాలు కూడా దుమారం లేపటంతో ఈయన కూడా అదే పంథాలో దాసుడి తప్పులు దండంతో సరి అన్నట్టుగా సారీ నోరు జారింది అని ప్రకటిస్తున్నారిప్పుడు. కానీ బహిరంగంగా చెప్పింది మాసిపోదు కదా. దానికి మందేముంది. అందుకే కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమని అంటారు. ఈ విషయం ఆ పెద్దలకు తెలియదని కాదు కానీ, ఎలాగైనా అమ్మని గెలిపించాలనే తాపత్రయమంతే. కానీ వెనక్కి తీసుకోలేని ఇలాంటి తప్పులకు దండన ఏ విధంగా వెయ్యాలన్నది న్యాయశాస్త్రాల్లో ఇసి కి లభిస్తుందేమో చూడాలి.

ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎలాగైనా సరే ఆధిక్యతను సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే ఇందిరమ్మను గుర్తు తెచ్చే ప్రియాంక గాంధీని కూడా ప్రచారంలోకి దించారు. అయితే, ప్రజలేమీ అమాయకులు కారు. ఎన్నికల సమయంలోనే ముఖం చూపించే నాయకుల మాటలకు వాళ్ళేమీ మోసపోరంటున్నారు ప్రతిపక్ష నాయకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amarsingh helicopter emergency landing
Tdp senior leader yanmala stands fair chance to get mlc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles