Women demanding mobile phones but not toilets

Women demanding mobile phones but not toilets,self-help groups,total sanitation campaign,rural development minister,mobile phones

Women demanding mobile phones but not toilets

Women.gif

Posted: 02/18/2012 10:07 AM IST
Women demanding mobile phones but not toilets

Women demanding mobile phones but not toilets

మహిళలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కాకుండా మొబైల్ ఫోన్లకోసం డిమాండ్ చేస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జై రాం రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పారిశుద్ధ్యం క్లిష్టమైన అంశం. ఇదే సమయంలో వ్యక్తుల ప్రవర్తనలో మార్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలంతా ఇప్పు డు మొబైల్ ఫోన్లకోసం డిమాండ్ చేస్తున్నారే తప్ప మరుగుదొడ్లను కోరుకోవడంలేదు.’ అని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా, ఫసిఫిక్ (ఈఎస్‌సీఏపీ) ఆధ్వర్యంలో ‘ఏసియన్ ఫసిఫిక్ మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్’ ప్రారంభ కార్యక్షికమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆహూతులకు, కార్యక్షికమ నిర్వాహకులకు ఒకింత ఇబ్బంది కలిగించాయి. ఈ సందర్భంగా వారు ఇటీవల మధ్యవూపదేశ్‌లో అనితా నర్రే అనే గిరిజన మహిళ మరుగుదొడ్డిలేదని కాపురానికి వెళ్ళకుండా ఆ గ్రామంలో మార్పుకు కారణమైన నేపథ్యాన్ని గుర్తు చేశారు. అప్పుడు మంత్రి ప్రతిస్పందిస్తూ తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలను తీర్చేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా, గుజరాత్‌లో 1970లో వచ్చిన శ్వేత విప్లవం నేపథ్యంలో ఆనాటి గ్రామీణ మహిళల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయో ‘మంథన్’ చిత్రంలో చాలా చక్కగా శ్యాంబెనగల్ చూపించారని, పారిశుధ్ధ్యంపై కూడా ఓ చిత్రాన్ని నిర్మించాలని ఆయన్ను కోరుతానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special powers to nctc objected
Bedgif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles