ఇంతకాలం స్విస్ బ్యాంకుల్లో అంత డబ్బు దాచారు, ఇంత డబ్బు దాచారు అంటూ ఎవరికివారు లెక్కలు చెప్తూ వచ్చారు. కానీ మొదటి సారిగా సిబిఐ డైరెక్టర్ ఎ.పి.సింగ్ ఒక ఇంటర్ పోల్ కార్యక్రమంలో ఫిబ్రవరి 13న మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన సుమారు 500 మిలియన్ల సొమ్ము ప్రపంచంలోని టాక్స్ మినహాయింపులున్న దేశాల్లో దాగివుందని అన్నారు. స్విస్ బ్యాంక్ లలో ఉన్న పెద్ద పెద్ద డిపాజిట్లన్నీ భారతవాసులవే అని ఎపి సింగ్ అన్నారు. ఈ లెక్కకు ఆధారమేమిటో తెలియజేయలేదు కానీ, టాక్స్ లు లేని మోరిషస్, స్పిట్జర్లాండ్, లిస్టెన్స్టీన్, బ్రిటిష్ వర్జిన్ దీవులలో కి పోతున్న భారత దేశ సొమ్మ వలన దేశం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోందని అన్నారు.
ఈ మాటలకు స్పందించిన న్యూఢిల్లీ లోని స్విట్జర్లాండ్ దౌత్య కార్యాలయం ప్రెస్ రిలీజ్ చేస్తూ, అందులో సిబిఐ ఛీఫ్ పేరు ఎత్తలేదు కానీ, స్విట్జర్లాండ్ టాక్స్ లేని ప్రాంతం కాదని ప్రకటించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపోజిట్ల మీద చాలా రకాల అంకెల అంచనాలు వినిపిస్తున్నాయి కానీ అవన్నీ పూర్తిగా నిరాధారమైన ప్రకటనలంటూ ఆ ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది. నల్ల ధనానికి కాపు కాస్తున్న దేశంగా చీటికీ మాటికీ వార్తల్లోకి ఎక్కటం స్విస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కానీ స్విస్ బ్యాంకుల పనితీరు జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ ప్రధాని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది కూడా స్విస్ అధికారులకు పాక్ అధ్యక్షుడి గురించి లేఖ రాయనందుకే. సిబిఐ డైరెక్టర్ లాంటి పెద్ద అధికారి ఏ ఆధారమూ లేకుండా అటువంటి ప్రకటననివ్వరు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more