ఎట్టకేలకు జూడాలు సమ్మె విరమించారు. నిన్న విద్యాశాఖా మంత్రి కొండ్రు మురళీ మోహన్ తో రాత్రి 11 గంటల వరకూ సాగిన చర్చల ఫలితంగా జూడాలు తాత్కాలికంగా సమ్మెను విరమించుకుంటున్నట్టుగా తెలియజేసారు. చర్చలలో తీసుకున్న నిర్ణయాల మేరకు రాతపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత సమ్మెను పూర్తిస్థాయిలో నిలిపివేస్తామని మాటిచ్చారు.
ఎమ్మెల్సీ నాగేశ్వర్ చొరవతో అంతకు ముందు ప్రభుత్వంతో ఫలించని చర్చలు నిన్న సచివాలయంలో సుదీర్ఘ చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వం అంగీకరించిన వారి కోరికల విషయంలో మౌఖికమైన హామీ తర్వాత అవే రాత పూర్వకంగా ఉండాలని ముందు పట్టుబట్టినా, చివరకు సమ్మెను తాత్కాలికంగా విరమించటానికి ఒప్పుకున్నారు.
జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతమై అత్యవసర సేవలను కూడా బహిష్కరించటంతో రాష్ట్రవ్యాప్తంగా రోగులకు ఎంతో ఇబ్బందులు ఎదురవటమే కాకుండా, ఇటు జూడాలు, అటు ప్రభుత్వం కూడా ప్రజల నిరసనలకు పాత్రలవుతున్నారు. ఎవరూ పట్టు విడవకుండా ఉండటంతో పరిస్థితి చెయిదాటి పోతున్న సందర్భంలో జరిగిన ఈ ఒప్పందంతో పరిస్థితి మళ్ళీ కుదుటపడటానికి అవకాశం లభించటంతో పాటుగా కొత్తగా విద్యా శాఖా మంత్రి గా పదవీ బాధ్యతలను చేపట్టిన కొండ్రు మురళి కూడా వస్తూనే ఒక సమస్యను పరిష్కరించిన పేరు కూడా దక్కించుకున్నారు.
ఒక పక్క చర్చలు సాగిస్తూనే మరో పక్క హైకోర్టు సాయం కూడా తీసుకున్న ప్రభుత్వం అత్యవసర సేవల దృష్ట్యా జూడాల మీద ఎస్మా ప్రయోగించటానికి సిద్ధపడింది. హాస్పిటల్స్ లో రోగులు ప్రాణాలు పోగొట్టుకోవటం ప్రభుత్వానికి, డాక్టర్లకూ కూడా చెడ్డ పేరు తెచ్చి పెడుతోంది. నిన్న జరిగిన చర్చలతో ప్రభుత్వానికి, జూడాలకు కూడా సంకటావస్థనుంచి బయటపడటానికి మార్గం లభించింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more