Kapunadu meeting

Kapunadu - Meeting, Kapu-Telaga, Balija, Kapunadu, Meeting, kapunadu sangharshana samithi

Kapunadu - Meeting

Kapunadu.gif

Posted: 02/13/2012 04:33 PM IST
Kapunadu meeting

Kapunadu - Meeting

1962 లో స్వర్గీయా దామోదరం సంజీవయ్య కాపులను బీసిలలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసారన్నారు. అదే విధంగా 1994 , 1999 అసెంబ్లీ ఎన్నికలలో కాపులకు అత్యధికంగా కాన్షీరాం రాష్ట్రంలో సీట్లు కేటాయించారని వారు వివరించారు. కాపుల సమస్యలను పరిష్కరించుకోవడానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు పిలుపు ఇచ్చారు. నగర కాపునాడు అధ్యక్షుడు సిరతపల్లి అప్పారావు అధ్యక్షతన వనస్థలిపురంలోని ఎన్‌జీఓస్ కాలనీలోగల కాపు కళ్యాణమండపంలో కాపునాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో బీసీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించి కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22% ఉన్న కాపులకు జనాభా ప్రతిపాదికన రాజకీయ పదవులు ఇవ్వాలని కోరారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగ నియామకాల్లో వాటాను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇతర కులాలకు ఇచ్చినట్లుగానే ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఉద్యమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. ఈ నెల 27, 28, 29లో రాష్ట్ర వ్యాప్త కాపునాడు ఉద్యమాన్ని నగరంలోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కాపునాడు అధ్యక్షులు శ్రీనివాస్‌రావు, తాడి రమేశ్, రాముడు, నాగరాజు, నాంచారయ్య, మంగారావు పాల్గొన్నారు.
దళితులంటే కాపులకు గౌరవమని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని వారు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో ఈ రెండు సామాజిక వర్గాలు అధిక సంఖ్యలో ఉన్నందున ఆ రెండు జిల్లాలను లక్ష్యంగా ఎంచుకొని కొన్ని శక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assembly adjourned till tomorrow
Newsreader commits suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles