Estranged wife can live in husbands house

Estranged wife can live in husband's house,Estranged wife, Supreme Court, Domestic Violence Act

Estranged wife can live in husband's house

wife.gif

Posted: 02/13/2012 04:08 PM IST
Estranged wife can live in husbands house

ఇప్పడు ధర్మాసనం కొత్త పుంత్తలు తొక్కుతుంది. సుప్రీంకోర్టు సరికొత్త తీర్పు చెప్పింది. ‘‘ చెప్పులోని రాయి, చేవులోని జోరీగా’’ అనే మాదిరిగా ఆ తీర్పు ఉందని ప్రజలు అంటున్నారు. భర్త నుంచి విడిపోయిన భార్యకు ఆయన నివాసంలో ఉండే హక్కుతోపాటు గృహ హింస నిరోధక చట్టం(పీడబ్ల్యూడీ) ప్రకారం మనోవర్తిని కోరే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి రాకముందే వారిద్దరూ విడిపోయినా.. భార్యకు ఈ హక్కులు దఖలు పడతాయని తేల్చిచెప్పింది. ఢిల్లీకి చెందిన దంపతుల కేసులో జస్టిస్ అల్తమస్ కబీర్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తాజాగా రూలింగ్ ఇచ్చింది.

ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. ఢిల్లీకి చెందిన వీడీ భానోత్, సవిత భానోత్ 1980లో వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి 2005 నుంచి విడిగా ఉంటున్నారు. అయితే గృహహింస నిరోధక చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ సవిత 2006లో స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. మనోవర్తి కింద సవితకు నెలకు రూ.6వేలు ఇవ్వాలని, అలాగే తన ఇంటిలోని పై అంతస్తులో ఓ పోర్షన్ ఆమెకు ఇవ్వాలని వీడీ భానోత్‌ను జడ్జీ ఆదేశించారు. లేదా ఆమెకు నచ్చిన ఇంట్లో చేరే అవకాశం కల్పించాలని, ఇందుకు నెలకు రూ.10 వేలు అద్దె చెల్లించాలని సూచించారు. అయితే, తనకు ఇంట్లో శాశ్వతంగా ఉండే హక్కు కల్పించాలని సవిత కోరారు. దీన్ని మేజిస్ట్రేట్ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో సవిత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో భానోత్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Newsreader commits suicide
Sebi to join social networking bandwagon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles