Brain not the heart drives you to fall in love

Brain, not the heart, drives you to fall in love,Brain seat of love,love,Valentine`s Day

Brain, not the heart, drives you to fall in love

Brain.gif

Posted: 02/13/2012 11:54 AM IST
Brain not the heart drives you to fall in love

Brain, not the heart, drives you to fall in love

This is your brain on love  వాలెంటైన్స్ డేకు ముందు వెలువడ్డ ఓ అధ్యయన ఫలితం ప్రేమపక్షులు తెలుసుకోవాల్సిన ఓ కొత్త విషయాన్ని, ఆసక్తికర అంశాన్ని ఆవిష్కరించింది. మనిషి ప్రేమలో పడటంలో హృదయం కన్నా మెదడే కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. రొమాంటిక్ ఫీలింగ్స్ వాస్తవానికి మెదడు నుంచే వస్తాయని, గుండె నుంచి కాదని స్పష్టం చేశారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ప్రేమలో నిండా మునిగిన పది మంది యువతుల, ఏడుగురు యువకుల మెదడు మ్యాగ్నటిక్ రెజొనెన్స్ ఇమేజ్‌లను పరిశీలించి ఈ నిర్థారణకొచ్చారు. వీరిలో కొందరు నెల రోజుల నుంచి, మరికొందరు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రయోగంలో పాల్గొన్నవారికి వారి ప్రేమికుల ఫొటోలను, ప్రేమికులను పోలిన వ్యక్తుల ఫొటోలను చూపారు. ప్రేమికుల ఫొటోలు చూడగానే వారి మెదడు స్పందించి, భావోద్వేగ ప్రతిస్పందనలు ఉత్పత్తయ్యాయి. కాగా ఒక వ్యక్తిలో రొమాంటిక్ లవ్‌కు మించిన శక్తిమంతమైన ప్రతిస్పందనేదీ లేదని, ప్రేమలో ఉన్నప్పుడు మనుషులు ఆనందంగా, ఆతృతగా ఉంటారని అధ్యయనానికి నేతృత్వం వహించిన అర్థర్‌ఆరాన్ తెలిపారు. ప్రేమను గెలిచిన తర్వాత కొన్నాళ్లకు ఆ ఫీలింగ్ వాడిపోతుందా అంటే అది పూర్తిగా కరెక్ట్ కాదని చెప్పారు. తాము ప్రేమ పెళ్లి చేసుకొని 21 ఏళ్లయినా తమ మధ్య ఆ ఫీలింగ్ ఏమాత్రం తగ్గలేదని మరో అధ్యాయనంలో పాల్గొన్నవారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assembly budjet session starts today onwards
Delhi police ready to take on moral police on valentine s day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles