Group 1 toppers

8.gif

Posted: 02/12/2012 12:26 PM IST
Group 1 toppers

              appscఎంతో మంది ఉద్యోగార్థులకే కాదు, ఉద్యోగంలో ఉన్నవారికి సైతం కలల సౌధం గ్రూఫ్ 1 కొలువు. అలాంటి ఉన్నత మైన ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవలందించగలికే అద్భతమైన అవకాశం ఎందరికి వస్తుంది చెప్పండి.. అసలు ఈ కొలువు సాధించటమే చాలా గొప్పదిగా భావిస్తాం. అలాంటిది మొత్తం గ్రూఫ్ 1 పరీక్ష లోనే టాపర్స్ గా నిలిస్తే ఎలా ఉంటుంది.. ఊహించండి.. ఆ మహనీయమైన అనుభూతిని సొంతం చేసుకున్నారు గేదెల శ్రీనుకుమార్., మరియూ ప్రియాంక.,.

group_1ఇటీవల జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో ఏలూరుకు చెందిన శ్రీనుకుమార్ 575 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఏలూరు కొత్తపేటకు చెందిన గేదెల రామస్వామి, కోటేశ్వరమ్మలకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు కాగా, శ్రీనుకుమార్ ఒక్కడే కుమారుడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కోటేశ్వరమ్మ కష్టపడి పిల్లలను పెంచి పెద్దచేసింది. శ్రీనుకుమార్‌లో ఉన్న ఆసక్తిని గమనించి ఆమె చదువు చెప్పించింది. దీంతో 1999లో గ్రూప్-2లో శ్రీనుకుమార్ ఎంపీడీవోగా, అనంతరం 2009 గ్రూపు-2లో జోనల్ టాపర్‌గా నిలిచి సబ్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు.

gedela_sriniఅయితే ఇక్కడ విషాదమేమంటే, శ్రీనుకు గతంలో వరకట్న వేధింపుల కేసులో భార్య మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలపై జైలు శిక్షకూడా పడటం.

ఇక మహిళా కేటగిరిలో మొదటి స్థానం కూడా పశ్చిమగోదావరి జిల్లాకే దక్కింది. భీమవరం పట్టణానికి చెందిన ప్రియాంక గ్రూఫ్ 1 ఫలితాల్లో ఆరో ర్యాంకు సాధించి, ఈ ఘనత వహించింది. పట్టణానికి చెందిన సిహెచ్ సత్యనారాయణ, వరలక్ష్మి దంపతుల కుమార్తె ప్రియాంక. తండ్రి వీరవాసరంలో బ్యాంక్ మేనేజర్. వరంగల్ ఎన్ఐటి లో బీటెక్ పూర్తి చేసిన ప్రియాంక, 2007లో బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా భాద్యతలు స్వీకరించిన ఈమె ప్రస్తుతం ఈ ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యారు. తన యాంబిషన్ ఐఎఎస్ అంటోంది. ప్రియాంక.

priyankaమహిళా విభాగంలో గ్రూఫ్ 1 టాపర్ గా నిలిచిన ప్రియాంకకు అభినందనలు కుటుంభ, బంధుమిత్రుల నుంచే కాదు అందరినుంచీ ప్రశంసలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దీనికి థాంక్యూ వెరీమచ్ అంటోందీమె. ఈ విజయ పరంపరకు ఆంధ్రావిశేష్.కామ్ కూడా శుభాకాంక్షలు చెబుతోంది. కంగ్రాట్స్ గేదెల శ్రీనుకుమార్. అండ్ ప్రియాంక.

... …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ec writes to president about law ministers behavior
Assembly getting ready for budget meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles