Excise minister mopidevi venkataramana

Excise minister Mopidevi Venkataramana, Congress Party, Ministers, Yerasu prathap Reddy, MLA aadala prabhakara Reddy, M Ranga reddy, ACB, Minister DL Ravindra Reddy, BC cast, CM Kiran kumar reddy,

Excise minister Mopidevi Venkataramana

mopidevi02.gif

Posted: 02/11/2012 10:15 AM IST
Excise minister mopidevi venkataramana

Excise minister Mopidevi Venkataramanaమద్యం సిండికేట్ల వ్యవహరాల్లో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని, వాటిపై విచారణ జరిపించడానికి ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. ఆరోపణలపై జరిగే విచారణను ఎదుర్కొంటానని, తన నిజాయితీని నిరూపించుకుంటానని ఆయన ప్రకటించారు. సిఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎసిబి ఇంకా తన వివరణ కోరాల్సి ఉందని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో రిమాండ్‌ రిపోర్ట్‌లో ఎవరి పేర్లు ఉంచారో, ఎవరి పేర్లు తొలగించారో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. విచారణ జరగకుండా తన పేరును రిమాండ్‌ రిపోర్టులో చేర్చిన సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఆర్‌పికే మద్యం విక్రయం, మద్యం సిండికేట్ల విషయంలో గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని ఆయన చెప్పారు. తనకు మద్దతునిచ్చిన మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వెంకటరమణ ఎవరినో ఎవరో బలిపశువును చేస్తున్నారని ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనకు మద్దతు తెలిపిన బిసి సంఘాలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి బిసిలను అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బిసిల అభ్యున్నతికి కృషి చేసింది కాంగ్రెస్సేనని, బిసిల వల్లనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Last day of medaram jatara
Dog bites tv anchors face during live show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles