Electricity pre paid card systems

electricity Pre-paid card systems, Andhrapradesh Chief Minister N Kiran Kumar reddy, Kiran, CM Kiran, Pre paid Cards, formers, BSNL, Money,

electricity Pre-paid card systems

electricity.gif

Posted: 02/11/2012 09:41 AM IST
Electricity pre paid card systems

 electricity Pre-paid card systems

సెల్‌ఫోన్‌ రంగం తరహాలో విద్యుత్తు రంగంలోనూ ప్రీ పెయిడ్‌ కార్డుల పద్ధతిని డిస్కాంలు ప్రవేశపెట్టనున్నాయి. ముందస్తు వసూళ్లే ధ్యేయంగా తీసుకురానున్న సంస్కరణల అమలుకు 'కిరణ్‌' సర్కార్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ ప్రయోగం ప్రజలపై చేపడితే ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో.. తొలుత ప్రభుత్వ శాఖల్లో అమలు చేయనుంది. ఇది విజయవంతమైతే విద్యుత్తు వినియోగ దారులపైనే గాకుండా, వ్యవసాయ, చిన్నతరహా పరిశ్రమల్లోనూ ఇదే తరహా సంస్కరణలు తీసుకురానుంది. ఇదేగనుక అమలయితే చిన్న సన్న కారు రైతుల పరిస్థితి అగమ్యగోచరం కానుంది. ఇప్పటికే విద్యుత్తును సక్రమంగా సరఫరా చేయని ఆ సంస్థ ఇలాంటి సంస్కరణలను తీసుకురావడం వల్ల భవిష్యత్తులో పేదలపై వడ్డన భారం మోపే అవకాశం ఎంతో దూరం లేదు.
మౌలిక సేవలను విస్మరిస్తూ విద్యుత్తు శాఖ వాణిజ్యపరంగా అడుగులేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ తరహాలో ప్రి పెయిడ్‌ కార్డులను విక్ర యించి ముందస్తుగా సొమ్ము లాక్కునే వ్యూహం పన్నింది. ఇందుకు సంబం ధించిన ఏర్పాట్లన్నీ చాపకింద నీరులా విద్యుత్తు శాఖలో ఊపందుకుంటున్నాయి. మొదట్లో ప్రజలపై ప్రయోగిస్తే ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని భావించి ప్రభుత్వ శాఖల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనుంది.
ప్రి పెయిడ్‌ విద్యుత్తు కార్డులను త్వరితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌పిడిసిఎల్‌ (తిరుపతి), ఇపిడిసిఎల్‌ (వైజాగ్‌), సిపిడిసిఎల్‌ (హైదరాబాద్‌), ఎన్‌పిడిసిఎల్‌ (వరంగల్‌) డిస్కంల పరిధిలో 2,69,720 విద్యుత్తు కనెక్షన్లున్నాయి. నెలసరి విద్యుత్తు బిల్లులు ప్రభుత్వ సంస్థలు రూ.52.22 కోట్లు చెల్లిస్తున్నాయి. ఫ్యానులు, లైట్లు నిలిపేయాలని సూచిస్తే ఎవరికీ పట్టడం లేదనీ, ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల బాధ్యతగా సిబ్బంది వ్యవహరిస్తారనీ ప్రభుత్వ వాదన.
ప్రి పెయిడ్‌ కార్డు వాడుకోవడం ఎలాగంటే?
ప్రతి సర్వీసుకూ మీటర్‌ పక్కనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని అమరుస్తారు. పోస్టుపెయిడ్‌ అయితే ఎంత బిల్లు వచ్చినా చెల్లించాల్సిందే. ప్రి పెయిడ్‌ కార్డులకు మాత్రం ఎంతకు కార్డు కొంటామో అంతవరకే కరెంట్‌ సరఫరా అవుతుంది. డబ్బులు అయిపోయిన వెంటనే ఆటోమేటిక్‌గా కరెంట్‌ సరఫరా నిలిచిపోతుంది. సంబంధిత ఫ్యూజు కార్యాలయంలో కార్డు రీఛార్జి చేసుకుంటేనే మళ్లీ విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. ఈ పద్ధతిని ప్రభుత్వ శాఖల్లో త్వరలోనే అమలు చేయనున్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి 'ఔను వాస్తవమే, ప్రిపెయిడ్‌ సర్వీసులను తీసుకురానున్నాం. ఈ మేరకు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక పంపింది. బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఏవిధంగా డబ్బులు వసూలు చేసి సేవలు అందిస్తున్నారో, అలాగే మేం కూడా ముందుగా డబ్బు తీసుకుని విద్యుత్తు అందిస్తాం. ఇది సంస్థకు లాభమేగాక వినియోగదారుడు బాధ్యతగా వ్యవహరించి విద్యుత్తును వృథా చేయరు' అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dog bites tv anchors face during live show
On road show priyanka asks sp nominee to join cong  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles